Begin typing your search above and press return to search.
అందుకే భర్తను చంపేసి ఇంట్లో పూడ్చి పెట్టిందట
By: Tupaki Desk | 11 March 2021 6:00 PM ISTఇద్దరిది రెండో పెళ్లి. మనసులు కలిసి.. మతాలు మార్చుకొని పెళ్లి చేసుకున్న వారి వైవాహిక బంధం మూణ్నాళ్ల ముచ్చటైంది. భర్తను చంపేయటమే కాదు.. ఇంట్లోనే పాతి పెట్టిన వైనం షాకింగ్ గా మారింది. ఎందుకిలా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఒక్కతే.. చెట్టంత మనిషిని చంపేసి ఇంట్లోనే ఎలా పూడ్చేసింది? అన్నది ప్రశ్న. వీటికి సమాధానాలు వెతగ్గా.. సంచలన అంశాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం కేసు విచారణ సాగుతున్న వేళ.. పూర్తిగా ఇదే జరిగిందని తేల్చేయలేం కానీ.. ఇప్పటికైతే బయటకు వచ్చిన వివరాలు ఇవే.
హైదరాబాద్ లోని బేగం బజార్ కు చెందిన 40 ఏళ్ల గగన్ అగర్వాల్ ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తుంటారు. ఇంట్లోని గొడవల కారణంగా భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. కొద్ది కాలానికి పాతబస్తీకి చెందిన నౌశిన్ బేగం అనే 38 ఏళ్ల మహిళను ఇష్టపడ్డాడు. ఆమె కూడా భర్త నుంచి విడాకులు తీసుకొని ఉంది. ఆమెకు నలుగురు కూతుళ్లు.. ఒక కొడుకు. గగన్ ను పెళ్లి చేసుకునే వేళలో మతం మార్చుకుంది. మర్యాద అగర్వాల్ గా పేరు మార్చుకుంది. ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్న అనంతరం.. పిల్లల్ని పుట్టింట్లో ఉంచేసింది.
గగన్ కు నగరంలో నాలుగు ఇళ్లు ఉన్నాయి. మూడు నెలల క్రితమే వారు వనస్థలిపురం దగ్గర్లోని మన్సూరాబాద్ లోకి మకాం మార్చారు. పిల్లలు అప్పుడప్పడు వచ్చి వెళ్లేవారు. అయితే.. తన పెద్ద కుమార్తెపై భర్త కన్నేయటంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ విషయంలో ఇరువురు మధ్య గొడవలు వచ్చేవి. అదే సమయంలో.. భర్త స్నేహితుడు సునీల్ తో ఆమెకు పరిచయమైంది. ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది. దీంతో.. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం..ముగ్గురు కూర్చొని మందు తాగారు. మధ్యలో తన కుమార్తె పట్ల తప్పుగా వ్యవహరిస్తున్నవాన్న అంశంపై వాదన మొదలై.. అనంతరం కత్తితో భర్తను పొడిచేసింది. ఆమెకు సునీల్ సాయం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం సునీల్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇంతకూ ఈ హత్య ఉదంతం ఎలా బయటకు వచ్చిందన్న విషయంలోకి వెళితే.. గగన్ మేనకోడలి పెళ్లి ఫిబ్రవరి 16న నిర్ణయించారు. ఖర్చుల కోసం సోదరికి రూ.4లక్షలు ఇచ్చాడు గగన్. పెళ్లికి ఒక్కరోజు ముందు.. తాను ఢిల్లీ నుంచి దోహా వెళుతున్నానని.. పెళ్లికి రాలేనని మెసేజ్ చేశారు. అది గగన్ ఫోన్ నుంచి కాకపోవటంతో అనుమానం వచ్చింది. వెంటనే కొత్త నెంబరుకు ఫోన్ చేస్తే.. స్విచ్ఛాప్ ఉంది. దీంతో అనుమానంవచ్చి హైదరాబాద్ కు వచ్చి అన్న గురించి అడిగితే నౌశిన్ తనకు తెలీదని చెప్పటంతో వారు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులుపలుమార్లు విచారించినా ఎలాంటి ఆధారం లభించలేదు. ఎస్ఎంఎస్ వచ్చిన నెంబరును ట్రేస్ చేయగా.. ఒక వ్యక్తిదని తేలింది. అతడ్ని అడగ్గా.. నౌశిన్ తన ఫోన్ అడిగి మెసేజ్ పంపినట్లుగా చెప్పాడు. దీంతో.. ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించగా.. హత్య గురించి వివరాల్ని కక్కేసింది. ఈ ఉదంతంపై మరింత లోతుగా పోలీసులు విచారిస్తున్నారు.