Begin typing your search above and press return to search.
ఆమెకి 45 , అతడికి 21, 5 మంది కూతుళ్లు .. ట్విస్ట్ ఇదే !
By: Tupaki Desk | 12 July 2021 1:06 PM ISTప్రేమ కి ..పెళ్లికి వయస్సు తో సంబంధం లేదు అంటే ఇదేనేమో. అయితే మనం ఓ సమాజం లో బ్రతుకుతున్నాం. ఆ సమాజంలో కొన్ని కట్టుబాట్లు , ఆచారాలు కూడా ఉన్నాయి. వాటిని ఇష్టం ఉన్నా లేకున్నా పాటించాలి. అన్నింటిని కాకపోయినా , వాటిల్లో కొన్ని ముఖ్యమైన కట్టుబాట్లని పాటించాల్సిందే. అయితే ,ఓ 45 మహిళ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమెకి ఐదుమంది కూతుర్లు. వారిలో 21 ఏళ్ల వయస్సు ఉన్న పెద్ద కూతురికి ఈ మధ్యనే పెళ్లి చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా కూడా .. తాజాగా 21 ఏళ్ల యువకుడితో ప్రేమాయణం నడుపుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. యూపీ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వయసున్న మహిళకు ఐదుగురు కూతుళ్లున్నారు. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. ఆ తర్వాత రెండేళ్లలోనే భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత వినోద్ అనే వ్యక్తిని పెళ్లాడింది. రోడ్డు ప్రమాదంలో రెండో భర్త కూడా మరణించడంతో కొన్ని రోజుల తర్వాత బ్రిజేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతడితో ఉండగానే 21 ఏళ్ల కుర్రాడు మిథున్‌తో కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది. ఈ క్రమంలోనే ఆమె మూడో భర్త అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆ జంటకు అడ్డు చెప్పే వాళ్లే లేకపోయారు. ఈ విషయం గురించి ఊర్లో పలురకాలుగా మాట్లాడుకుంటుండటం తో కూతుర్లు అవమానంగా భావించి తల్లిని నిలదీశారు. ఆమె ఐదుగురు కూతుళ్లలలో 21 ఏళ్ల వయసున్న పెద్ద కుమార్తెకు కొద్ది నెలల క్రితమే వివాహం అయింది. ఆమె కూడా ఇంటికి వచ్చి తల్లిని నిలదీసింది. పద్ధతి మానుకోమనీ, పెళ్లీడుకు వచ్చిన కూతుళ్లు ఉన్నారనీ, వారి భవిష్యత్ కోసమైనా సక్రమంగా నడుచుకోవాలని హితవు చెప్పింది.
దీనితో ఆ మహిళ పెద్ద కుమార్తెను ఇంటి నుంచి బయటకు గెంటేసింది. మిగిలిన నలుగురు కూతుళ్లు కూడా ఆమెపై ఆగ్రహించడంతో వారిని కూడా ఇంట్లోంచి వెళ్లగొట్టింది. దీనితో ఆ కూతుళ్లంతా శనివారం పోలీసులను ఆశ్రయించారు. వ్యవహారం తెలిసిన పోలీసులు ఆ ప్రేమ జంటను స్టేషన్ కు పిలిపించారు. స్టేషన్ కి వచ్చినా వారిలో మార్పు వచ్చిందా అంటే .. పోలీసులకే కనువిప్పు చేశారు. మేం మేజర్లం. మాకిష్టం వచ్చినట్టు బతుకుతాం. మీకేంటి నష్టం. నా కూతుళ్లకు నేను అన్నం పెట్టడం లేదా, హింసిస్తున్నానా, ఏంటీ గొడవ, అతడితో నేను ఉంటే తప్పేంటి, నా కూతుళ్లకు వచ్చిన ఇబ్బందేంటి అంటూ ఆ మహిళ పోలీస్ స్టేషన్ లో కూడా గట్టిగా వాదించింది. అలాగే ఆ 21 ఏళ్ల యువకుడు కూడా .. మా విషయం గురించి ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదు. పరువు పోతుందని ఇబ్బంది పడనక్కర్లేదు. నేను తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. త్వరలోనే ఆమెను నా భార్యగా చేసుకుంటా. ఆమె కూతుళ్లను నా కూతుళ్లుగా చూసుకుంటా. నా సంపాదన అంతా వారికే ఖర్చు చేస్తా. వారి పెళ్లిళ్లు చేస్తా. భవిష్యత్తులో వాళ్లకు అండగా ఉంటా అంటూ మిథున్ చెప్పిన మాటలు విని పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరకు వాళ్లిద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇది పద్ధతి కాదని నచ్చజెప్పారు. అయితే పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్ తో మిథున్ లో మార్పు వచ్చినా ఆ మహిళలో మాత్రం మార్పు రాలేదు. అతన్ని విడిచిపెట్టను అని చెప్పింది.