Begin typing your search above and press return to search.

పప్పు రాహుల్ కాదు.. మోడీనే..

By:  Tupaki Desk   |   24 April 2019 11:15 AM IST
పప్పు రాహుల్ కాదు.. మోడీనే..
X
2014 ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేసి.. ఆయన అసమర్థతను ఎత్తిచూపేలా ‘పప్పు’ అంటూ బీజేపీ నేతలు నోరుపారేసుకున్నారు. పప్పు పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ లు కూడా చేశారు. అయితే ఇటీవలే మోడీ తీరు నచ్చక బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ - సీనియర్ నటుడు శతృఘ్న అసలు పప్పు ఎవరో క్లారిటీ ఇచ్చారు.

గుజరాత్ రాష్ట్రంలోని వడదొరలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో శతృఘ్న సిన్హా మాట్లాడారు. గత ఏడాది చివరలో రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - చత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూడడంతో అసలు పప్పు ఎవరో అందరికీ తెలిసిందని మోడీని ఉద్దేశించి శతృఘ్న సిన్హా ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఒక్కడే హిందీ బెల్ట్ లోని కీలక రాష్ట్రాల్లో బీజేపీని ఓడించాడని.. దీంతో పప్పు మోడీ అని నిరూపితమైందని సిన్హా నిప్పులు చెరిగారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎవరు పప్పునో - ఎవరు బూటకపు హామీలిచ్చి ఫేకూగా నిలిచారో ప్రజలే చెబుతారని అన్నారు. మోడీ మళ్లీ ప్రధాని కాబోరని.. 2022 - 2024 - 2029లోనూ నకిలీ వాగ్ధానాలిస్తూనే ఉంటారని సెటైర్ వేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

నోట్లరద్దు - జీఎస్టీ లాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలను మోడీ తీసుకున్నారని.. అవి తీసుకునేముందు సీనియర్ నేతలు , కేబినెట్ మంత్రులనూ సంప్రదించలేదని అన్నారు. అందుకే తాను మోడీని విమర్శిస్తుంటానని చెప్పారు. ఇలా ఎన్నికల వేళ.. మోడీ అంటేనే ఒంటికాలిపై లేస్తున్న శతృఘ్న బీజేపీ శిబిరాన్ని ఆడుకుంటున్నారు.