Begin typing your search above and press return to search.

సచిన్, ధోని నన్ను ఆ విషయంలో బాగా నిరాశపరిచారు : కేంద్ర మాజీమంత్రి !

By:  Tupaki Desk   |   4 Sep 2020 11:30 PM GMT
సచిన్, ధోని నన్ను ఆ విషయంలో బాగా నిరాశపరిచారు : కేంద్ర మాజీమంత్రి !
X
సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్‌ ధోని .. ఈ ప్రపంచం లో క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ రెండు పేర్ల గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరు క్రికెట్ కి మాస్టర్ .. మరొకరు కూల్ కెప్టెన్. ఇద్దరికిద్దరు సాటే. అయితే , ఈ ఇద్దరు కూడా ఒక విషయంలో తీవ్రంగా నిరాశపరిచారని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ ఆటపరంగా పక్కన పెడితే, అంపైర్‌ నిర్ణయ సమీక్ష పద్ధతిని ప్రవేశపెట్టిన సమయంలో వ్యతిరేకించడం తనను అసంతృప్తికి గురి చేసిందన్నారు. టెక్నాలజీకి తాను అతిపెద్ద అభిమానినని తెలియజేసాడు.

‘ నేను టెక్నాలజీకి ఎప్పుడూ పెద్ద పీట వేస్తా. డీఆర్ ‌ఎస్‌ ను ప్రవేశపెట్టిన తొలినాళ్ల నుంచి దానికి అడ్వోకేట్‌గా ఉన్నా. కానీ సచిన్‌, ధోని లు డీఆర్‌ ఎస్ ‌ను ప్రవేశపెట్టిన ఆరంభంలో వ్యతిరేకించారు. ఇది నన్ను తీవ్రంగా నిరూత్సాహపరిచింది. నేను క్రికెట్ ‌ను రెగ్యులర్‌ గా చూస్తూ ఉంటా. డీఆర్ ‌ఎస్‌ వచ్చిన కొత్తలో మనవాళ్లు అంపైర్ల నిర్ణయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉండేది. వారికి డీఆర్‌ ఎస్‌ అంటే ఎందుకు ఇష్టం లేదో నాకైతే ఇప్పటివరకూ తెలీదు. డీఆర్ ‌ఎస్‌ అనేది క్రికెట్లో తీసుకొచ్చిన అతిపెద్ద సవరణ. డీఆర్‌ ఎస్ ‌తో ఫీల్డ్‌లో అంపైర్లు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలకు సరైన సమాధానం దొరుకుతుంది. ఇది క్రికెట్‌ లో సరికొత్త శకానికి నాంది అని స్పోర్ట్స్‌ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశిథరూర్‌తెలిపారు .

2008లో భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా డీఆర్‌ ఎస్ ‌ను ప్రయోగించారు. అయితే దీన్ని అప్పట్లో టీమిండియా బాగా వ్యతిరేకించింది. అందులోని లోటుపాట్లను ధోని, సచిన్‌ లు బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లడంతో దాన్ని వ్యతిరేకించకతప్పలేదు. కాగా, 2016లో భారత పర్యటనకు ఇంగ్లండ్‌ వచ్చిన సమయంలో డీఆర్‌ ఎస్ ‌కు ఎట్టకేలకు బీసీసీఐ ఓకే చెప్పింది.