Begin typing your search above and press return to search.

మోడీ బంగ్లా పర్యటన వేళ శశిథరూర్ సారీ

By:  Tupaki Desk   |   27 March 2021 8:08 AM GMT
మోడీ బంగ్లా పర్యటన వేళ శశిథరూర్ సారీ
X
బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పై ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ క్షమాపణలు తెలిపారు. ప్రముఖ న్యూస్ చానెల్ లో వచ్చిన హెడ్ లైన్స్ ను సరిగ్గా చదవలేకపోవడంతో తప్పు దొర్లిందని.. క్షమించండి అంటూ ఆయన ట్విట్టర్ లో మోడీకి సారీ చెప్పారు.

1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ను వేరు చేయడంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను ప్రధాని మోడీ అంగీకరించడం లేదంటూ శశిథూర్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. బంగ్లాదేశ్ కు కూడా ప్రధాని మోడీ భారతీయుల ఫేక్ న్యూస్ రుచిచూపిస్తున్నాడని థరూర్ ట్విట్టర్ లో విమర్శించాడు. బంగ్లాదేశ్ కు స్వేచ్ఛను ఎవరు ఇచ్చారో తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు.

అయితే బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం సిద్ధించడంలో ఇందిరాగాంధీ కృషిని ప్రధాని మోడీ గుర్తు చేశాడు. ఇందిర ధైర్యాన్ని కొనియాడారు. థరూర్ దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ట్వీట్ చేసినట్లు వెల్లడైంది.

తన పొరపాటు గ్రహించిన థరూర్ తాజాగా తను చేసిన ట్వీట్ ను తొలగించాడు. దాంపాటు మోడీకి క్షమాపణలు చెప్పాడు. పొరపాటు చేసినప్పుడు దాన్ని అంగీకరించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రధాని మోడీ బంగ్లాదేశ్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. బంగ్లా స్వాతంత్రానికి పాటుపడ్డ వారికి భారత అత్యున్నత పురస్కారం అందజేశారు.