Begin typing your search above and press return to search.

ఖద్దరు పార్టీకి ఇద్దరు... మసాలా ఉంటుందా..?

By:  Tupaki Desk   |   8 Oct 2022 4:42 PM GMT
ఖద్దరు పార్టీకి ఇద్దరు... మసాలా ఉంటుందా..?
X
అఖిల భారత కంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ పార్టీ అతి పురాతమైనది. 1885లో పుట్టి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో అగ్ర భాగాన నిలిచి ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే డమ్మీ అయినా ఘనమే సుమా అన్నట్లుగా ఉంటుంది. అందుకే పోటీ కోసం ఎందరో తయారయ్యారు. కానీ చివరాఖరుకు ఇద్దరే మిగిలారు.

నామినేషన్ల విత్ డ్రా తరువాత పెద్దాయన మల్లిఖార్జున ఖర్గె, ఫైర్ బ్రాండ్ కేరళ లీడర్ అయిన శశి ధరూర్ రేసులో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు నెగ్గుతారు అనందే ఇపుడు చర్చ. అయితే కాంగ్రెస్ లో అయితే రసవత్తరమైన పోటీ సీన్ కనిపించడంలేదు. ఖర్గె వైపు హై కమాండ్ ఉందన్న సందేశం ఈసరికే మొత్తానికి వెళ్లిపోయింది.

దాంతో తొమ్మిది వేల పై చిలుకు ఉన్న పార్టీలో అత్యధిక ఓట్లు ఖర్గె ఖాతాలోకే వెళ్ళబోతున్నాయి అని అంటున్నారు. ఖర్గె తెలుగు రాష్ట్రాలకు వచ్చినపుడు ఆయనకు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికిన తీరు చూస్తే అది ష్యూర్ అనే అంటున్నారు. శశిధరూర్ హైదరాబాద్ వస్తే పలకరించే వారే లేరు.

ఇక జీ 23 మెంబర్స్ కూడా ప్లేట్ తిప్పేశాక శశిధరూర్ ఆశలు పూర్తిగా నీరు కారాయి అని అంటున్నారు. ఇక రసవత్తరమైన పోటీ అంటే 1997 లో సీతారామ్ కేసరి శరద్ పవార్, రాజేష్ పైలెట్ ల మధ్యన బీకరమైన తీరున సాగిందే అని చెప్పాలి. అపుడు ఇంతలా వన్ సైడెడ్ గా ఉమ్మడి ఏపీ లేదు. నాడు వైఎస్సార్ వర్గం ఓపెన్ గా పవార్ కి సపోర్ట్ చేసింది. అలాగే రాజెష్ పైలెట్ కి కూడా మద్దతు కొన్ని రాష్ట్రాలలో కొన్ని చోట్ల దక్కింది. అయినా సీతారామ్ కేసరి గెలిచారు.

ఆ తరువాత 2000లో సోనియాగాంధీతో జితేంద్ర ప్రసాద పోటీ పడినా అది నామమాత్రంగా అయింది. ఈసారి అయితే ఆ మాదిరి పోటీ కూడా కనిపించేలా లేదు అనే అంటున్నారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యస్ఖ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు 19న వస్తాయి. సో ఇద్దరు నేతలలో ఖద్దరు పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అన్నది ఆ రోజు అధికారికంగా తెలుస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.