Begin typing your search above and press return to search.

శశికి నిర్మల పరామర్శ.. అభినందనీయమే!

By:  Tupaki Desk   |   16 April 2019 12:56 PM IST
శశికి నిర్మల పరామర్శ.. అభినందనీయమే!
X
రాజకీయ నేతలు విధాన పరంగా విమర్శించుకుని, వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉంటే దాన్ని ఎవరూ కాదనరు. అలాంటి సన్నివేశమే కేరళలో చోటు చేసుకుంది. ఆసుపత్రి పాలైన కాంగ్రెస్ నేత - కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ను ప్రస్తుత కేంద్రమంత్రి - బీజేపీ నేత నిర్మలా సీతారామన్ పరామర్శించడం ఆసక్తిదాయకంగా ఉంది. తనను నిర్మల పరామర్శించిన విషయాన్ని శశిథరూర్ ట్వీట్ చేశారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒక ఆలయంలో తులాభారం ఇవ్వబోతూ తీవ్రంగా గాయాలపాలయ్యారు శశిథరూర్. ఆయన తక్కెడలో కూర్చోగా.. దాని చైన్స్ తెగిపోయాయి. దండెం వచ్చి ఆయన తల మీద పడింది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చేర్చారు.

ఈ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు శశి. ఇంతలోనే ఇది జరిగింది. ఆయన తలకు కుట్లు కూడా పడ్డాయట.

ఇక కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నిర్మల సీతారామన్ కు జరిగిన విషయం తెలిసి, ఆమె ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న శశిని పరామర్శించారు. ఇలా వేర్వేరు రాజకీయ పార్టీల వారే అయినా, ఎన్నికల వేడిలో కూడా ఈ పలకరింపు ఆసక్తిదాయకంగా ఉంది.

తనను పరామర్శించిన నిర్మలా సీతారామన్ కు శశి కృతజ్ఞతలు తెలిపారు. అమె పలకరింపు తన మనసును తాకిందని కవిభావంతో చెప్పారు శశిథరూర్.