Begin typing your search above and press return to search.

టీవీలు బంద్ చేసి మాస్కులు తయారు చేస్తోంది

By:  Tupaki Desk   |   6 March 2020 1:30 AM GMT
టీవీలు బంద్ చేసి మాస్కులు తయారు చేస్తోంది
X
షార్ప్. ఈ ప్రముఖ టీవీలు తయారు చేసే కంపెనీ గురించి దేశంలో ఎవరినడిగినా చెబుతారు. సామ్ సంగ్, ఎల్జీ లాంటి సంస్థలు రాకముందు ఈ షార్ప్ పోర్టబుల్ టీవీలే ఎక్కువగా మార్కెట్లో ఉండేవి. ఇప్పటికీ ఈ సంస్థ టీవీల తయారీనే ఎక్కువగా చేస్తోంది.

తాజాగా జపాన్ కు చెందిన ఈ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ లాభాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రస్తుతానికి టీవీల తయారీ బంద్ చేసి సర్జికల్ మాస్క్ ల తయారీని చేపట్టింది. దీనికి కారణం ‘కరోనా వైరస్’.

చైనా పక్కనే ఉండే జపాన్ లోనూ కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. దీంతో జపాన్ లో ఒక్కరోజుకు లక్షాయాభై వేల మాస్క్ లు వాడుతున్నారు. కరోనా భయం నుంచి కాపాడుకోవడానికి ఇలా చేస్తున్నారు. అయితే సరిపడా మాస్క్ లు మార్కెట్లో లేక డిమాండ్ బాగా పెరిగిపోయింది.

తాజాగా జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే నెలకు 6000 లక్షల మాస్క్ లు తయారీ చేయాలని షార్ప్ సహా ఉత్పత్తి సంస్థలను కోరారట.. దీంతో టీవీలు, ఎల్సీడీ ప్యానెళ్ల తయారు చేసే ఈ కంపెనీ.. వాటన్నింటిని పక్కనపెట్టి ఇప్పుడు మాస్క్ ల తయారీపై పడింది. దీనికి విపరీతంగా లాభాలు వస్తున్నాయట..

ఇలా కరోనా భయం షార్ప్ కంపెనీకి కాసులు కురిపిస్తోంది. జనాలకు నిత్యవసరంగా మారిన మాస్క్ లు తయారు చేస్తూ షార్ప్ కంపెనీ లాభాలు పండిస్తోందట.. చావు భయానికి అందరూ మాస్క్ లు వాడడం.. షార్ప్ సంస్థ అందిపుచ్చుకోవడం..వీరి బిజినెస్ స్ట్రాటజీ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.