Begin typing your search above and press return to search.

సాక్షిపై షర్మిల సెటైర్.. విజయమ్మ షాక్!

By:  Tupaki Desk   |   15 April 2021 4:54 PM IST
సాక్షిపై షర్మిల సెటైర్.. విజయమ్మ షాక్!
X
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం వైఎస్ షర్మిల ఈరోజు హైదరాబాద్ ఇందిరాపార్క్ ఎదుట దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ సర్కార్ ను దునుమాడింది. ఈ ప్రసంగం సమయంలోనే ఆశ్చర్యకమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది.ఇందిరా పార్క్ వద్ద షర్మిల మైక్ తో ప్రసంగిస్తుండగా మీడియా చానెల్స్ అన్నీ ఆమె ఎదురుగా మోహరించాయి. అయితే ప్రజలు కనిపించడం లేదని పక్కకు జరగాలని షర్మిల మీడియా చానెల్స్ వారికి సూచించింది.

అయితే ఇంతలో అక్కడే ఉన్న సాక్షి టీవీ వాళ్లు.. 'మేడం మేం సాక్షి' అనేశారు. దీనికి సర్రుమన్న షర్మిల సాక్షి చానెల్ కు చురకలు వేశారు. ‘కవర్ చేసింది చాల్లేమా.. ఎలాగూ సాక్షి మా కవరేట్ ఇవ్వదుగా' అంటూ సెటైర్ వేసింది.అయితే కొడుకు జగన్ చేతుల్లోని సాక్షి చానెల్ పై కూతురు షర్మిల అలా అనేసరికి పక్కనే ఉన్న విజయమ్మ షాక్ అయిపోయారు. వెంటనే తేరుకొని షర్మిలను మెల్లగా చేత్తో తట్టారు. అలా అనొద్దు అన్నట్టుగా సైగ చేశారు.

దీన్ని బట్టి అన్నయ్య జగన్ తో షర్మిలకు అభిప్రాయబేధాలు ఉన్నాయని.. సొంత సాక్షి చానెల్ లోనూ షర్మిలకు హైప్ ఇవ్వడం లేదన్న సంగతి తెలియవచ్చిందని అక్కడి మీడియా వర్గాలు గుసగుసలాడుకున్నాయి. ఇది అక్కడ చర్చనీయాంశమైంది.