అన్న గురించి కూడా ఒక్క మాట షర్మిలమ్మా...?

Fri Oct 07 2022 19:13:15 GMT+0530 (India Standard Time)

sharmila on ap ysjagan

రాజకీయాలూ సీబీఐ. రాజకీయాలూ ఈడీ. ఇదొక విడదీయరాని బంధంగా మారుతోంది. తప్పు చేసిన వారిని శిక్షించేందుకు వ్యవస్థలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఉన్న వారు అందరూ తప్పులు చేస్తున్నారా అంటే లేదు. కొన్ని రకాలుగా కక్షలు కూడా కేసులు రావడానికి కారణం అవుతున్నాయి. అయితే మెజారిటీ జనాలు రాజకీయ వ్యవస్థ అంతా బాగుందని అనుకోవడం లేదు. అలాగని అందరి మీద కేసులు పడడంలేదు.  ఇక కేసులు పడ్డవారు చెడ్డవరని పడని వారు మంచి వారని అనుకోవడానికి ఎక్కడా వీలు లేదు. ఏది ఏమైనా రాజకీయాల్లో ఎదగడానికి అలాగే పతనం కావడానికి కూడా ఈ కేసులు దోహదపడుతున్నాయన్నది ఓ రాజకీయ విశ్లేషణ. ఈ విషయాలను పక్కన పెడితే తెలంగాణా సీఎం కేసీయార్ మీద సీబీఐ విచారణ జరపాలి అని అంతా డిమాండ్ చేయడమే తప్ప ఎవరూ సీబీఐని ఇంతవరకూ కోరినది లేదు.

అయితే అలాంటి పనిని వైఎస్సార్టీపీని స్థాపించిన వైఎస్ షర్మిల చేస్తున్నారు. ఆమె కేసీయార్ అవినీతి మీద విచారణ జరిపించాలని ఏకంగా ఢిల్లీ వెళ్ళి సీబీఐ అధికారులను కలసి ఫిర్యాదు చేశారు. ఆమె కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అంటున్నారు. వైఎస్సార్ హయాంలో 38 వేల కోట్లు ఉన్న ఈ ప్రాజెక్ట్ వ్యయం కేసీయార్ ఏలుబడిలో ఏకంగా లక్షా ఇరవై వేలకు పెంచేశారు అని విమర్శించారు.

ఒకపుడు స్కూటర్ కూడా లేని కేసీయార్ ఇపుడు సొంత విమానం ఎలా కొనగలిగే  స్థోమత ఎలా సాధించారు అని షర్మిల సెటరిలు వేశారు. ఇలా చాలా పాయింట్లతో ఢిల్లీలో సీబీఐకి ఫిర్యాదు చేశానని  డీఐజీ స్థాయి అధికారితో కేసీయార్ అవినీతి మీద విచారణ జరిపించాలని కోరానని షర్మిల తెలిపారు. సరే ఇవన్నీ బాగానే ఉన్నా పనిలో పనిగా తన అన్న ఏపీ సీఎం జగన్ మీద ఉన్న సీబీఐ కేసుల విషయం గురించి వాటి ప్రస్తుత దశ గురించి తెలుసుని విచారణ వేగవంతం చేయలని సీబీఐని షర్మిల కోరితే బాగుంటుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఢిల్లీ దాకా వెళ్ళిన చెల్లెమ్మ అందునా సీబీఐ ఆఫీసులో కాలు పెట్టిన షర్మిలమ్మ అన్న మీద పడ్డ సీబీఐ కేసుల విషయంలో పురోగతి తెలుసుకుని అవి తక్షణం పూర్తి అయ్యేలా వత్తిడి తెస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. దీని వల్ల వైఎస్సార్ ఫ్యామిలీకి విలువ మరింతగా పెరుగుతుంది తప్ప తగ్గదని నెటిజన్లు అంటున్నారు.

చెల్లెమ్మా ఈ ఉపకారం చేసిపెడితే అన్నతో పాటు దేశానికి మేలు చేసినవారు అవుతారని నెటిజన్లు అంటున్నారు. మరి ఇది వారు ఉత్సాహంతో అంటున్నా కూడా  వైసీపీ వారు తమ తప్పు ఏదీ లేదని సీబీఐ కేసుల విషయంలో వాదిస్తున్న నేపధ్యంలో సత్వరమే విచారణ ముగిస్తే అది టోటల్ వైఎస్ ఫ్యామిలీకే బాగా ఉంటుంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.