Begin typing your search above and press return to search.

ప్రభువు పిలుపు... నాయకుడి పయనం

By:  Tupaki Desk   |   21 Dec 2018 4:59 PM IST
ప్రభువు పిలుపు... నాయకుడి పయనం
X
మంచివాళ్లని దేవుడు తన దగ్గరకి తొందరగా తీసుకుని వెడతారని చెప్తుంటారు పెద్దలు.. నిజమే కావచ్చు. అందుకనేమో ప్రజానేత వైఎస్. రాజశేఖర రెడ్డి తొందరగా స్వర్గస్తులయ్యారు. మతాలు ఎన్నైన ఉండచ్చు.. కాని దేవుడు మాత్రం ఒక్కడే.. ఎందుకంటే అందరూ చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరకే వెడతారు కాబట్టి. ఇదంతా ఎందకనుకుంటున్నారా...

వైఎస్. జగన్ మోహన రెడ్డి చెల్లేలు షర్మీల ప్రసంగం ఒకటి చాలా వైరల్‌ అయ్యింది. ఒక అధ్యాత్మిక ప్రసంగంలో షర్మిల మాట్లాడుతూ తన తండ్రి రాజశేఖర రెడ్డికి జీసస్‌ నుంచి పిలుపు వచ్చిందని - జీసస్ తన తండ్రికి రెస్ట్ ఇవ్వదల్చి తన దగ్గరకి తీసుకుపోయాడని షర్మిల అన్నారు. ఈ ప్రసంగం తాలుక వీడియో వైరాల్ అయ్యింది. తన తండ్రి రోజు బైబిల్ చదివేవారని - తన అన్న జగన్‌ను, తనని కూడా బైబిల్ చదవమనేవారని ఆవిడ తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. అంతేకాక సాయంత్రం ఇంటికి వచ్చి తామిద్దరం బైబిల్ చదిమామో లేదో అని అడిగి తెలుసుకునే వారని షర్మిల అన్నారు. తన తండ్రి రాజశేఖర రెడ్డి హేలికాఫ్టర్ ప్రమాదానికి గురైన రోజు కూడా ప్రొద్దున ఇంటి దగ్గర బైబిల్ చదివి బయలుదేరారని షర్మిల అన్నారు. అదే రోజు తాను తన తండ్రి చదివిన చివరి పేజీ దగ్గర పెట్టిన గురుతును బట్టి చూస్తే... చివరిగా " నీవు నా దగ్గరకు వచ్చేయ్... నీకు శాంతన చేకూర్చుతాను" అన్న లైన్లు చదివినట్టు తెలిసింది అని కాస్తా భావోద్వేగంతో అన్నారు.

అయితే రాజశేఖర రెడ్డి కుటుంబం క్రిస్టయన్ మతంలోకి మారినప్పటికి ఆ ఛాయలు ఎప్పుడు కూడా ప్రజలలో గాని, సమాజంలో గాని పడలేదు.. అయితే షర్మిల ఈ ప్రసంగం తర్వాత షర్మిల తమ ప్రియమైన నేతను మళ్లీ గురుతు చేసినట్లైయిందని వైఎస్‌ ఆర్ అభిమానులు అంటున్నారు.