Begin typing your search above and press return to search.

షర్మిలను సిగ్గు తీసిన సంఘటన

By:  Tupaki Desk   |   24 Aug 2021 8:30 AM GMT
షర్మిలను సిగ్గు తీసిన సంఘటన
X
ప్రతి మంగళవారం తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని నిరసన నిరహార దీక్ష చేపడుతోంది వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పార్టీ పెట్టిన షర్మిలకు తాజాగా వరుస షాక్ లు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతుంటే ప్రజల నుంచి కూడా ఊహించని షాక్ లు వస్తున్నాయి.

నిరుద్యోగుల సమస్యలపై షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న యువత కుటుంబాలను పరామర్శిస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ మంగళవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ లో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టాలని భావించిన వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. దీక్ష కోసం తమ ఇంటికి రావద్దంటూ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి నరేష్ తండ్రి షర్మిలకు విజ్ఞప్తి చేశారు. దీంతో దీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న వైఎస్ఆర్ టీపీ నాయకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

షర్మిలను దీక్షకు రావద్దని నిరుద్యోగి కుటుంబం ఎందుకు చెప్పిందనే దానిపై ఆరాతీయగా ఆసక్తి కర విషయం బయటపడింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ కు చెందిన నరేశ్ డిగ్రీ చదివాడు. చాలాకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తే నోటిఫికేషన్లు రాకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నరేశ్ ముగ్గురు అన్నలు బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నరేశ్ మాత్రం నిరుద్యోగిగా ఉండిపోయానన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇప్పుడు షర్మిల తమ ఇంటి వద్ద దీక్ష చేపడితే తన ముగ్గురు కొడుకుల ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుందేమోనన్న భయంతో నరేశ్ తండ్రి వైఎస్ షర్మిలను రావద్దని.. దీక్ష చేయవద్దని విజ్ఞప్తి చేసి షాక్ ఇవ్వడం విశేషం. షర్మిల ఓదార్పు మాకు అవసరం లేదని.. కుమారుడి మరణాన్ని రాజకీయం చేయడం ఇష్టం లేదని తండ్రి శంకర్ తెలిపారు. దీంతో షర్మిల దీక్షాస్థలిని దండేపల్లిలోని మరో చోటుకు మార్చారు.