షర్మిల సబ్జెక్... వర్కవుట్ కావట్లేదే!

Wed Jul 21 2021 15:27:07 GMT+0530 (IST)

Sharmila plan not working in telangana

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలకు `సబ్జెక్టులు వర్కువట్` కావట్లేదని అంటున్నారు పరిశీలకులు. ఆమె ఎంచుకున్న సబ్జెక్టులకు.. ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని చెబుతున్నారు. అంతేకాదు.. పార్టీ తరఫున షర్మిలను ప్రజలకు పరిచయం చేసే విధానంపై కూడా యూత్‌లో పెద్దగా క్రేజ్ కనిపించడం లేదు. షర్మిలను ``షర్మిలమ్మ`` అనే పిలవాలంటూ.. పార్టీ నేతల నుంచి ఆదేశాలు రావడం.. ఎవరు స్టేజీ ఎక్కినా.. షర్మిలను అమ్మ అని సంబోధించడం.. తెలంగాణ వాతావరణానికి సూట్ కాలేదని అంటున్నారు.ఈ పరిణామమే షర్మిలకు యూత్‌ను చేరువ చేయలేక పోయిందని అంటున్నారు. ఇక విద్యార్థుల తరఫున ఉద్యమం చేసినా.. వర్కువట్ కాలేదు. అదేసమయంలో వెంటనే వ్యూహం మార్చుకుని.. ఉద్యోగాలపై పోరుబాట పట్టారు. ఇక ఇప్పుడు పోడు భూముల హక్కుల కోసం.. పాదయాత్ర చేస్తున్నారు. అయితే.. ఇలా ఎన్నివ్యూహాలు మార్చుకున్నా.. ఇవన్నీ కూడా గతంలో వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చేసిన `కార్యక్రమాలను` పోలి ఉన్నాయని.. కొత్తగా ఏమీ కనిపించడం లేదనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం పార్టీలోనూ కీలక నేతలు ఎవరూ లేరు.

వాస్తవానికి ముందుగా.. చాలా పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. షర్మిల పార్టీకి నేతలు క్యూ కడతారని.. సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకున్నారు. కానీ ఇది ప్రచారంగానే ఉండిపోయింది. కీలకమైన నాయకులు ఎవరూ కూడా ముందుకు రాలేదు. అంతేకాదు.. ప్రజల్లో గుర్తింపు ఉన్న ఫేస్‌లు కూడా పట్టుమని పది కూడా లేదు. ఇది కూడా షర్మిల పార్టీ వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదని చెప్పడానికి ప్రధాన కారణమేనని అంటున్నారు పరిశీలకులు.

 తనే సర్వస్వం అనుకుంటున్న పార్టీలో కీలక నేతలు లేక పోవడం.. చేపడుతున్న కార్యక్రమాలకు ఫాలోయింగ్ లేకపోవడం.. ముఖ్యంగా యూత్‌ను తనవైపు తిప్పుకోవడంలో విఫలం కావడం.. వంటివి.. షర్మిల రాజకీయాలకు ప్రధాన అవరోధంగా ఉన్నాయని.. చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎవరూ ముందుకు వచ్చి.. ఆమె పార్టీలో చేరేందుకు సిద్ధంగా లేరని అంటున్నారు పరిశీలకులు.