Begin typing your search above and press return to search.

ఐదేళ్ల తర్వాత ఆ ఫీట్ చేసినోడిగా నిలిచారు శార్దూల్

By:  Tupaki Desk   |   6 Sep 2021 2:07 AM GMT
ఐదేళ్ల తర్వాత ఆ ఫీట్ చేసినోడిగా నిలిచారు శార్దూల్
X
ఎంతటి తోపు క్రికెట్ టీం అయినా సరే.. ఎనిమిది.. తొమ్మిది.. పదో వరసలో దిగే బ్యాట్స్‌మన్‌ బ్యాటింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. జట్టులో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ల మాదిరే.. అత్యుత్తమ బౌలర్లు ఉంటారు. అంతేకాదు.. రెండింటిలోనూ ఇరగదీసే క్రికెటర్లతో కూడిన జట్టు కనిపించదు. ఎంత పెద్ద జట్టు అయినా.. సరే చివరి ముగ్గురు.. నలుగురు బ్యాట్స్‌మన్లు అత్యుత్తమైన వారు ఉండటం చాలా చాలా కష్టం. ఇక.. వారు భారీ స్కోర్ సాధించే అవకాశం కూడా తక్కువ.

ఎక్కువ మ్యాచుల్లో ఐదారు వికెట్లతోనే లక్ష్యాన్ని చేరుకోవటం కానీ.. లేదంటే భారీ స్కోర్ సాధించటం ఉంటుంది. ఎనిమిది తొమ్మిది వికెట్ల వరకు ఆధారపడటం తక్కువ. ఒకవేళ.. ఆధారపడినా.. ఆ టైంలో బరిలోకి దిగే బ్యాట్స్‌మన్లు రాణించటం కూడా తక్కువే. అలాంటి అలవాటుకు చెక్ పెట్టిన బ్యాట్స్‌మన్‌ గా నిలిచారు శార్దూల్ ఠాకూర్. తాజాగా జరుగుతున్న ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ లో ఎనిమిదో బ్యాట్స్‌మన్‌ గా దిగి.. రికార్డును క్రియేట్ చేశాడు.

మొదటి ఇన్నింగ్స్ లో ప్రధానమైన బ్యాట్స్‌మన్లు ఫెయిల్ అయిన వేళ బరిలోకి దిగిన శార్దూల్ 37 బంతుల్లో మూడు సిక్సర్లు.. ఏడు ఫోర్ల (46 పరుగులు)తో మొత్తం 57 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లోనూ కోహ్లీ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దూల్.. నిలకడైన ఆటను ప్రదర్శించాడు. 72 బంతుల్లో 60 పరుగులు చేశాడు. దీంతో.. టీమిండియా ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. దీంతో.. టీమిండియా 336 పరుగుల అధిక్యతతో ఉంచి.

ప్రస్తుతం బుమ్రా తొమ్మిది పరుగులతో.. ఉమేశ్ యాదవ్ 13 పరుగులతో ఆడుతున్నారు. ఇదిలా ఉంటే.. రెండు ఇన్నింగ్స్ లోనూ అర్థసెంచరీ సాధించిన ఎనిమిదో నెంబరు ఆటగాడిగా శార్దూల్ కొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. గతంలో ఇలాంటి రికార్డును 2010లో హర్భజన్‌ సింగ్.. 2014లో భువనేశ్వర్‌ కుమార్‌.. 2016లో వృద్ధిమాన్‌ సాహాలు సాధించారు. ఇప్పడా వరుసలో శార్దూల్ పేరు వచ్చి చేరింది.