Begin typing your search above and press return to search.
ఆ లేఖ పై బీజేపీ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్
By: Tupaki Desk | 9 Dec 2020 1:00 PM ISTప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన గురించే చర్చ నడుస్తుంది. తాజాగా భారత్ బంద్ కూడా నిర్వహించడం తో ఇప్పుడు ఈ సమస్య పై మరింత మంది గళం ఎత్తే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే .. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలని రైతులు చేస్తున్న ఆందోళనలకి దేశంలోని ప్రముఖ విపక్ష పార్టీలు అన్ని కూడా తమ మద్దతు తెలుపుతున్నాయి. అలాగే రైతులు ఇచ్చిన భారత్ బండ్ లో విపక్ష పార్టీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సమస్య పై ఇప్పటికే రైతులతో కేంద్రం చర్చలు జరిపినా కూడా ఆశిచించిన ఫలితం అయితే రాలేదు.
ఇకపోతే , కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతు పలుకుతున్న వారిలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ కూడా ఉన్నారు. అయితే, శరద్ పవర్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఢిల్లీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు షీలా దీక్షిత్, శివరాజ్ సింగ్ చౌహాన్ లకు రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. వ్యవసాయ చట్టాలను సవరించాలని, సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని శరద్ పవార్ ఆ లేఖలో కోరారు. అప్పుడలా లేఖ రాసిన శరద్ పవార్ ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, రైతులకు మద్దతు పలుకుతున్నారంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ అయన పై విరుచుకుపడ్డారు.
అప్పట్లో రాసిన లేఖను చూపుతూ బీజేపీ తనపై చేస్తున్న విమర్శల దాడిపై శరద్ పవార్ స్పందించారు. ‘అవును ఆ లేఖ రాసింది నిజమే. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ కి కొన్ని సంస్కరణలు అవసరమే. ఈ చట్టాన్ని కొనసాగించాలి. అయితే అంతకుముందు కొన్ని సంస్కరణలు చేయాలి. నేనే లేఖ రాశాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాల్లో ఏపీఎంసీ గురించి ఎక్కడా పేర్కొనలేదు. ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ఈ లేఖను ప్రస్తావిస్తోంది. దీనికంత ప్రాముఖ్యం ఇవ్వాల్సిన పనిలేదు అని పవార్ స్పష్టం చేశారు.