Begin typing your search above and press return to search.
టీడీపీ గూటిలోకి వైసీపీ వ్యూహకర్త శంతన్ సింగ్... గుట్టు రట్టేనా...?
By: Tupaki Desk | 22 Dec 2022 10:00 PM ISTఎన్నికల్లో ఎన్నో చిత్రాలు వారు వీరు అవుతారు. వీరు మరెక్కడో తేలతారు. ఇదంతా రాజకీయ నాయకుల గురించే. వారి ప్రయోజనాల కోసం పార్టీలు మారడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది. దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు కూడా. అయితే ఇపుడు ఎన్నికలలో ఆయా పార్టీల గెలుపు కోసం పనిచేసే వ్యూహకర్తలు కూడా అటు నుంచి ఇటు మళ్ళుతున్నారు. నిజానికి ఈ వ్యూహకర్తలు ఒక పార్టీకి కట్టుబడి ఉండాలని లేదు కానీ వారు తాము ఎన్నుకున్న పార్టీ కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుని దాన్ని పూర్తి కాలం అమలు చేయడానికి కుదురుకున్న వారు.
మధ్యలో వీరు పార్టీలు మారడం అంటే ఆశ్చర్యమే కాకుండా రాజకీయాల్లో కొత్త విధానంగా చెప్పాలి. గతంలో కూడా వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ మోడీ ప్రధాని కావడానికి పనిచేశారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు తన సేవలు అందించారు. అయితే ఒక పార్టీలో పనిచేస్తూ మధ్యలో మాత్రం మారలేదు. అయితే ఇపుడు ఆ పనిని ఇండియన్-పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐప్యాక్ కీలకమైన సభ్యుడు శంతన్ సింగ్ చేశారు.
ఆయన 2019 నుంచి ఏపీలో వైసీపీ విజయానికి పనిచేస్తూ వస్తున్నారు. వైసీపీ బలాలు బలహీనతలు ఆయనకు పూర్తిగా తెలుసు. ప్రత్యేకించి ఐప్యాక్ టీం లీడర్ రుషి రాజ్ సింగ్ కి శంతన్ సింగ్ అత్యంత సన్నిహితుడు. ఆయన ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి. ఇక వచ్చే ఎన్నికల్లో రెండవసారి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఐప్యాక్ టీం కృషి చేస్తున్న వేళ అందులో కీలకంగా ఉంటూ వచ్చిన శంతన్ సింగ్ సడెన్ గా పార్టీ మార్చేయడం అంటే ఆశ్చర్యమే.
ఆయన తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ నాయకత్వంలో పనిచేయడానికి రెడీ అయిపోయారు. ఇక ఐప్యాక్ లో ఆయన కీలక మెంబర్ అయితే ఇక్కడ డైరెక్టర్ హోదాలో ఆయన పనిచేయబోతున్నారు అని అంటున్నారు. అన్నింటికీ మించి నాలుగేళ్ల నుంచి వైసీపీలో పనిచేస్తున్న శంతన్ సింగ్ వద్ద వైసీపీ కి సంబంధించి గుట్టు చాలా ఉంది అని అంటున్నారు. ఆయన అతి విలువైన సమాచారాన్ని తెచ్చి తెలుగుదేశం పార్టీ కోసం అందించవచ్చు అని అంటున్నారు.
దీని వల్ల వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం రాజకీయంగా చాలా బెనిఫిట్ పొందే చాన్స్ ఉంది అంటున్నారు. ఎందుకంటే వైసీపీ ఇపుడు ఏ రకమైన ఎత్తులు వేస్తోంది.దాని వ్యూహాలు ఏంటి అన్నది శంతన్ సింగ్ కి పూర్తిగా తెలుసు అంటున్నారు. ఒక విధంగా ప్రత్యర్ధి వ్యూహాలు అన్నీ తెలిసిపోయాక కచ్చితంగా పై చేయి సాధించే అవకాశం ఉంటుంది. ఇపుడు ఆ విధంగా శంతన్ సింగ్ రూపంలో విభీషణుడు లాంటి వారు లభించారు అని అంటున్నారు మరి దీన్నీఅ పార్టీ ఏ విధంగా వాడుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.