Begin typing your search above and press return to search.

హైదరాబాదీయుల మర్యాద ఇదేనా? మెట్రోలో నేల మీద బాలింత

By:  Tupaki Desk   |   26 Oct 2021 3:54 AM GMT
హైదరాబాదీయుల మర్యాద ఇదేనా? మెట్రోలో నేల మీద బాలింత
X
ఒక ఫోటో సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ తెగ వైరల్ అవుతోంది. ఒక చంటి బిడ్డను ఎత్తుకున్న మహిళ మెట్రో రైల్లోనినేల మీద కూర్చొని ప్రయాణించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఆర్టీసీ బస్సులు.. ట్రైన్లు.. ఎంఎంటీఎస్ లలో ఎవరైనా పెద్ద వయస్కురాలైన మహిళ కానీ.. చంటి పిల్లలతో ఎక్కిన వారికి సీటు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంటుంది. మరేం జరిగిందో కానీ.. అందుకు భిన్నమైన సీన్ హైదరాబాద్ మెట్రోలో చోటు చేసుకుంది.

చంటి పిల్లను ఎత్తుకున్న ఒక బాలింత మెట్రో రైలు ఎక్కారు. అక్కడున్న సీట్లలో అమ్మాయిలు కూర్చొని ఉన్నారు. ఎవరి మొబైల్ ఫోన్ లో వారు మునిగిపోయి ఉన్నారు. ఎవరిని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. తన కష్టం గురించి సీటు అడగాలని ఆ బాలింత అనుకోలేదేమో. ఏమీ మాట్లాడకుండా నేల మీద కూర్చొని ప్రయాణించిన వైనంపై నెటిజన్లు మండిపడుతున్నారు. హైదరాబాదీయుల్లో ఉండే కనీస మర్యాద మిస్ అయ్యిందని.. ఇలాంటి కష్టం ఎవరికి ఉండకూదన్న వేదన వ్యక్తమవుతోంది.

తోటి ప్రయాణికుల కష్టాన్ని గుర్తించి.. మానవత్వంతో స్పందించాల్సింది పోయి.. అందుకు భిన్నంగా తమకు పట్టనట్లుగా ఉండటానని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రజా రవాణాలోబాలింతలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటిదే మెట్రోలో కూడా ఇవ్వటం మంచిదన్న మాట వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.