Begin typing your search above and press return to search.

ఒడ్డుకు కొట్టుకొ‌చ్చిన సాగ‌ర‌క‌న్య‌.. అది ఏ తీరం?

By:  Tupaki Desk   |   29 Jan 2021 6:00 AM IST
ఒడ్డుకు కొట్టుకొ‌చ్చిన సాగ‌ర‌క‌న్య‌.. అది ఏ తీరం?
X
సాగ‌ర‌క‌న్య అన‌గానే శిల్పా శెట్టి గుర్తుకు వ‌స్తుంది. మ‌త్స్య‌క‌న్య అంటే శిల్పాలా ఉండాలి! అన్నంత అందంగా క‌నిపిస్తుంది ఆ చిత్రంలో. మ‌ళ్లీ అలా అంత ఇదిగా వేరొక నాయిక ఆ పాత్ర‌కు కుద‌ర‌లేదు. ఇక మ‌ల్లికా శ‌రావ‌త్ హిస్ స్ స్ అంటూ అన‌కొండ గెట‌ప్ తో అల‌రించింది.

కానీ ఇప్పుడు మ‌రో సాగ‌ర‌క‌న్య‌నే త‌ల‌పిస్తోంది మోడ‌ల్ కం న‌టి షామా శికంద‌ర్. అలా సాగ‌రంలో ఫోటోషూట్లో పాల్గొన్న షామా త‌న‌వైన అందచందాల‌తో మురిపిస్తోంది. లాంగ్ డిజైన‌ర్ ఫ్రాకులో నీటి మ‌ధ్య‌న గుట్ట‌ల‌పై నించుకుని ఫోజులిచ్చింది.అన్న‌ట్టు `సాహ‌స‌వీరుడు-సాగ‌ర‌క‌న్య` సీక్వెల్ తీస్తే ఈ మోడ్ర‌న్ బ్యూటీ సెట్ట‌వుతుందేమో కాస్త ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావుతో క‌లిసి ర‌చ‌యిత‌లు ప‌రుచూరి ఏదైనా ప్లాన్ చేస్తారేమో!! షామా టీవీ నుంచి షిఫ్ట‌య్యి పెద్ద వెండితెర స్టార్ అవ్వాల‌ని క‌ల‌లుగంటోంది. కానీ సౌత్ నుంచి ఇంకా పిలుపంద‌క వేచి చూస్తోంది. ఈలోగానే సోష‌ల్ మీడియాల్లో నిరంత‌ర ఫోటోషూట్ల‌తో అగ్గి రాజేస్తోంది.