Begin typing your search above and press return to search.
షేక్ స్పియర్ పుర్రెని దోచేశారంట
By: Tupaki Desk | 25 March 2016 10:52 AM ISTమరో సంచలన వార్త ప్రపంచ దేశాలకు షాకింగ్ మారింది. ప్రపంచ సాహిత్యంలో తనదైన ముద్ర వేసి.. ప్రసిద్ధ కవుల్లో ఒకరిగా నిలిచిన ప్రముఖ నాటక రచయిత షేక్ స్పియర్ కు చెందిన ఒక షాకింగ్ ఇష్యూ తాజాగా బయటకు వచ్చింది. ఆయన సమాధిని అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పుర్రెను దొంగలించినట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
అయితే.. ఈ వార్తల్ని షేక్ స్పియర్ సమాధి ఉన్న లండన్ లోని హోలీ ట్రినిటీ చర్చ్ ప్రతినిధులు మాత్రం తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. నిరాధార వార్తల్ని ప్రచారం చేయటం సరికాదన్న మాట వినిపిస్తున్నా.. షేక్ స్పియర్ సమాధి మీద అధ్యయనం చేస్తున్న పరిశోధక బృందం మాత్రం తాము కనుగొన్న అంశం నిజమని చెబుతున్నారు. అత్యాధునిక స్కానర్లతో షేక్ స్పియర్ సమాధిని పరీక్షించినప్పుడు సమాధిలోని ఆయన పెర్రె స్థానం ఖాళీగా కనిపించిందని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన కెవిన్ కలిస్ చెబుతున్నారు.
మరి.. కెవిన్ మాటలో నిజం ఎంతన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరి.. షేక్ స్పియర్ పుర్రె నిజంగానే చోరీకి గురైందా? అన్న సందేహాన్ని తీర్చేందుకు ఆయన సమాధి ఉన్న చర్చ్ ప్రతినిధులు మాత్రం సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. పుర్రెను దొంగలించారన్న ఆరోపణలతో.. షేక్ స్పియర్ సమాధిని తవ్వేందుకు తాము అనుమతించమని చెబుతున్నారు. మరి.. ఈ చోరీ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేదెలా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.