Begin typing your search above and press return to search.

క్రికెట్ నుండి మాత్రమే రిటైర్, ఇంట్లో కాదు అంటున్న షాహిద్ ఆఫ్రిది.. ఐదోసారి తండ్రి ..

By:  Tupaki Desk   |   15 Feb 2020 12:30 PM GMT
క్రికెట్ నుండి మాత్రమే రిటైర్, ఇంట్లో కాదు అంటున్న షాహిద్ ఆఫ్రిది.. ఐదోసారి తండ్రి ..
X
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ , మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. క్రికెట్ ప్రపంచంలో ఆఫ్రిదికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. క్రికెట్ గురించి తెలిసిన వారందరికీ దాదాపుగా షాహిద్ ఆఫ్రిది గురించి తెలిసే ఉంటుంది. ఒక్కసారి బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి దిగితే , కొట్టే సిక్సులకి ప్రపంచంలోని ఏ టీం బౌలర్లకు అయిన చుక్కలు కనిపించాల్సిందే. ఎంతసేపు ఉన్నాం అన్నది కాదు ,ఎన్ని రన్స్ కొట్టాం అనేది ఆఫ్రిది స్టయిల్. తన కెప్టెన్సీ లో పాక్ జట్టుకి ఎన్నో విజయాల్ని అందించాడు. అలాగే జట్టు ఆపదలో ఉన్న సమయాలలో తన సహయజమైన దూకుడైన అట తీరుతో జట్టుకి ఎన్నో విజయాల్ని అందించాడు. ఆఫ్రిది స్టయిల్ ఎలా ఉంటుంది అంటే ..కొట్టే ప్రతి బాల్ కూడా స్టేడియం అవతలి వైపు పడుతుందా అని అనిపిస్తుంది. సిక్సులకి కింగ్. అలాగే మరో ముఖ్యమైన విషయం ...ఆఫ్రిది పేరిట ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ కూడా ఉంది. కేవలం 37 బాల్స్ లోనే 100 పరుగులు పూర్తిచేసాడు. ఇకపోతే ఆఫ్రిది ప్రస్తుతం క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించ విషయం తెలిసిందే.

అయితే , ఈ మాజీ క్రికెటర్ ...క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు కానీ , ఇంట్లో మాత్రం ఇంకా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. తాజాగా ఆఫ్రిది భార్య నదియా ...ఐదో సంతానానికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆఫ్రిది తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే ఈ దంపతులకి నలుగురు కుమార్తెలు ఉండగా.. ఐదో పాప తమ ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఐదుగురు అమ్మాయిలతో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అయితే , దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలానే కొనసాగితే.. వచ్చే రోజుల్లో నీ భార్య, నీ కూతురు ఒకేసారి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరుతారంటూ కొందరు చరుకలు వేస్తుండగా.. అఫ్రిది క్రికెట్ నుండి రిటైర్ అయ్యి , ఇంట్లోనే క్రికెట్ టీం ని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. అలాగే మరికొందరు అభిమానులు , తమ అభిమాన క్రికెటర్ ఐదో సారి తండ్రి అయిన నేపథ్యం లో అభినందనలు తెలియజేస్తున్నారు.