Begin typing your search above and press return to search.

పుట్టాను ఇక్కడే చస్తాను..మోడీ కోసం దేశం విడిచి వెళ్లను

By:  Tupaki Desk   |   12 May 2019 7:17 AM GMT
పుట్టాను ఇక్కడే చస్తాను..మోడీ కోసం దేశం విడిచి వెళ్లను
X
మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత మోడీ గెలిస్తే ... తాను దేశం విడిచివెళ్లిపోతానన్న ప్రచారంపై ప్రముఖ నటి - రచయిత షబానా ఆజ్మీ ఘాటుగా స్పందించారు... మోడీ మళ్లీ ప్రధాని అయితే తాను ఇండియా వదిలి వెళ్లిపోతానని కొందరు రాతలు రాయడం రోత పుట్టిస్తోందని.. ఇది నాన్సెన్స్ వ్యవహారమని షబానా ఆజ్మీ ట్విట్టర్ వేదికగా వివరణిచ్చారు.. ఇది పూర్తి కల్పితమని... సెన్సెషన్ కోసం ఎవరి రాసిన రాతలుగా ఆమె కొట్టి పారేశారు.. అసలు ఇలాంటి తప్పుడు వార్తలను ఎందుకు సృష్టిస్తారో అర్ధం కావడం లేదని.. దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం తనకెందుకని ఆమె అన్నారు..

తాను పక్కా భారతీయురాలనని ఇక్కడే పుట్టాను ఇక్కడే చస్తానని ట్విట్టర్ లో ప్రకటన చేశారు.. ఎప్పుడూ తనకు దేశం విడచివెళ్లాలనే ఆలోచనలే రావని... ఇలా కొందరు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్ బ్రిగేడ్ ఒకటుందని.. వాళ్లేప్పుడు అబద్దాలను పదే పదే ప్రచారం చేస్తారని .. దాని వల్ల కొందరు దానికి నిజమని నమ్మే స్థితిలో ఉంటారని... దీనికి మించిన భయానక - అత్యంత దురదృష్టకరం ఉండదని షబనా వ్యాఖ్యానించారు... ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇలా పిచ్చి పిచ్చి రాతలను ప్రజల్లోకి ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తారని... దమ్ముంటే బయటకు వచ్చి తామే రాసామని ధైర్యంగా చెప్పాలని .. ఇలాంటి వాటికి తాను భయపడను - లొంగనని 68 ఏళ్ల షబనా స్పష్టం చేశారు...

ఏదైనా వాదన చేయాలనుకుంటే.. ఎదుటి వారి వాదనను పరిణితితో లాజిక్ తో తిప్పిగొట్టాలి.. మన రోజువారీ జీవితంలో ఎన్నో సంఘటనలు, సంఘర్షణలు తలెత్తుతాయి.. భావస్వేచ్చ హక్కు ఉన్న వాళ్లుగా స్పందిస్తాం.. కానీ ఇలా దొంగచాటు వ్యవహారంగా తప్పుడు ప్రచారం చేసే వాళ్లను ఏమనాలి.. మా తండ్రి ఖైఫీ అజ్మీ ఎప్పుడూ చెబుతుంటారు.. ప్రత్యర్థులు వేరు శత్రువులు వేరు.. ప్రత్యర్థులను శత్రువులుగా చూడోద్దని.. నేను అలానే ఉంటానని ట్విట్టర్ సందేశంలో ఆమె పేర్కొన్నారు.. దేశంలో మెజార్టీ అభిప్రాయాలను అనుకూలంగా వ్యక్తమైన విషయాల పై కూడా షబానా వాటికి వ్యతిరేకంగా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడి చాలా సందర్బాల్లో వార్తల్కోకెక్కారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీతైన షబనా ఆజ్మీ.. భర్త జావేద్ అఖ్తర్ కూడా మంచి కవిగా పేరు పొందారు..