Begin typing your search above and press return to search.

తల్లిని, పినతల్లిని కూడా వదలని కామ పిశాచి

By:  Tupaki Desk   |   20 Sept 2017 12:14 PM IST
తల్లిని, పినతల్లిని కూడా వదలని కామ పిశాచి
X
కడుపును పుట్టిన బిడ్డలను ఏ కష్టం రాకుండా కళ్లలో పెట్టి చూసుకుంటుంది.. అమ్మ. కానీ ఆ కొడుకు మృగంలా మారాడు.. కామంతో కళ్లు మూసుకుపోయిన అతడు.. కన్న తల్లిపైనే అత్యాచారం చేశాడు. డ్రగ్స్‌కు బానిస అయిన 21 ఏళ్ల యువకుడు పదుల సంఖ్యలో మహిళలపై అత్యాచారం చేసి.. చివరకు తల్లి, పిన తల్లిని కూడా తన కామ దాహానికి బలి చేశాడు. దీంతో కడుపు మండిన ఆ తల్లి కుమారుడిని కిరాయి హంతకులతో​కడతేర్చింది. ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.

ముంబయికి చెందిన రామ్‌చరణ్ రామ్‌దాస్ ద్వివేది(21) డ్రగ్స్‌కు, సెక్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో మహిళలపై అత్యాచారం చేశాడు. తల్లి, పిన తల్లిపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ద్వివేదిని భరించలేని తల్లి తన పెద్దకుమారుడు సీతారాంతో కలిసి రామ్‌చరణ్‌ను చంపించేందుకు ప్రణాళిక రచించింది.

ప్రణాళిక ప్రకారం తల్లి, పెద్దకుమారుడు కలిసి కిరాయి హంతకులకు ఆగస్టు 20న రూ.50 వేలు ముట్టజెప్పారు. అదే రోజు సీతారాం, కేశవ్, రాకేశ్ కలిసి రామ్‌చరణ్‌ను టెంపోలో ఓ గని వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రామ్‌చరణ్ గొంతు కోసి చంపిన ఈ ముగ్గురు.. అటు నుంచి పారిపోయారు. ఆ మరుసటి రోజే స్థానిక పోలీసులకు ద్వివేది మృతదేహం లభ్యమైంది.

అయితే రామ్‌చరణ్ అదృశ్యమైనట్లు కేసు నమోదు కావడంతో.. ఆ ఫోటోలను, డెడ్‌బాడీ ఫోటోలను పరిశీలించారు పోలీసులు. అనంతరం ఆ రెండు ఫోటోలను కలిపి పరిశీలించడంతో హత్యకు గురైన యువకుడు రామ్‌చరణ్ అని తేలింది. ఆ తర్వాత విచారణ ప్రారంభించిన పోలీసులు.. రామ్‌చరణ్ తల్లి, సీతారాం, కేశవ్, రాకేశ్‌లను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో చేసిన నేరాన్ని నిందితులు అంగీకరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.