Begin typing your search above and press return to search.

భారతీయుల శృంగార చరిత్ర ఇదీ

By:  Tupaki Desk   |   22 Jan 2020 1:30 AM GMT
భారతీయుల శృంగార చరిత్ర ఇదీ
X
భారతదేశ ప్రభుత్వం అశ్లీల వెబ్ సైట్లను బ్యాన్ చేసింది. అయితే వివిధ లింకులతో అవి వస్తూనే ఉన్నాయి.. వీటిని బ్యాన్ చేయాలని కొందరు కోరుతున్నారు. అయితే పోర్న్ బానిసలు మాత్రం ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అంటూ సోషల్ మీడియా లో నెత్తి నోరు కొట్టుకున్నారు కూడా.

అయితే విదేశీయుల కంటే ముందే భారతదేశంలో శృంగారంపై శాస్త్రాలు వెలిశాయి. రతి ఆసనాలను కూడా కొందరు రుషులు పేర్కొన్నారు. కామ శాస్త్రమూ వచ్చింది. ఆ కోవలోనే దేవాలయాలపై ఆ బూతు బొమ్మలు నాడు అవగాహన కోసం చెక్కారు. అందరూ బహిరంగంగా ఉండేచోట. అందులోనూ పూజలు జరిగే చోట.. ఇలాంటి అశ్లీలమైన బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయన్న ప్రశ్నలు తలెత్తకమానవు. ఐతే.. దీనికీ ఓ సమాధానం ఉంది. ఆ బొమ్మలు భారత సంస్కృతిలో శృంగారం ప్రాముఖ్యతను తెలియజేస్తాయి.

మానవుడి ధర్మ - అర్థ - కామ - మోక్షాల్లో కామానికి చాలా ప్రామఖ్యత ఉంది. కామాన్ని కూడా ఆ రోజుల్లో పవిత్రమైన కార్యంగా భావించేవారు. సృష్టి పరమ పవిత్రమైంది కాబట్టే గుళ్లలో ఆ శిల్పాలు ఉంచేవారట. అంతే కాదు.. భక్తిలో పడిపోయిన అసలు సృష్టి మరిచిపోకూడదన్నది కూడా మరో కారణం. అంతే కాదు.. రతిభంగిమల గురించి అప్పట్లో చర్చించే అవకాశం లేనందువల్ల ఆలయాలపై బొమ్మల ద్వారా శృంగార విద్య బోధించేవారు. అదీ సంగతి.