Begin typing your search above and press return to search.

హార్దిక్ పటేల్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

By:  Tupaki Desk   |   3 Dec 2017 3:20 PM GMT
హార్దిక్ పటేల్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
X
గుజరాత్‌లో బీజేపీకి కొరకరానికొయ్యలా మారిన పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ చిక్కుల్లో పడ్డారు. హార్దిక్ లైంగికంగా వేధించారంటూ ఒక బాలిక ఫిర్యాదు చేయడంతో ఆమెను కలిసేందుకు జాతీయ మహిళా కమిషన్ ఆమెను కలిసేందుకు ఆదివారం సాయంత్రం సూరత్ వెళ్లింది. ఇప్పటికే హార్దిక్ పై పలు వివాదాస్పద ఆరోపణలు చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు పక్కా స్కెచ్‌తో ఆయన్ను చుట్టుముడుతున్నట్లుగా తెలుస్తోంది.

కాగా హార్దిక్ పటేల్‌‌పై ఆరోపణలు చేసిన బాలిక జాతీయ కమిషన్‌కు ఒక వినతిపత్రం పంపించింది. ఫిర్యాదు చేయడానికి తాను భయపడుతున్నానని... అందువల్ల కమిషన్ సభ్యులు తన వద్దకు వస్తే అన్నీ మాట్లాడుతానని ఆమె ఆ వినతిపత్రంలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. దీంతో కమిషన్ సభ్యుల బృందం ఆమెను కలిసేందుకు వెళ్లింది.

ఈ పరిణామాలన్నీ నాటకీయంగా ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హార్దిక్ చుట్టూ బలంగా ఉచ్చు బిగుస్తున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే హార్దిక్ పటేల్‌కు చెందినవిగా చెబుతున్న సెక్స్ వీడియాలు వైరల్ అయ్యాయి. అవి నకిలీవని హార్దిక్ చెబుతున్నాడు. కాగా, ఈ వీడియోలపై అందిన ఫిర్యాదును కూడా పరిశీలిస్తున్నట్టు జాతీయ మహిళా కమిషన్ చెప్తోంది.