Begin typing your search above and press return to search.

వివాహం తర్వాత లైంగిక వేధింపులు.. దళిత కుర్రాడు ఆత్మహత్య

By:  Tupaki Desk   |   8 Oct 2020 2:22 PM IST
వివాహం తర్వాత లైంగిక వేధింపులు.. దళిత కుర్రాడు ఆత్మహత్య
X
ఉత్తరప్రదేశ్ లోని జలాన్ జిల్లాలో ఓరైకి చెందిన ఓబీసీ యువతి, దళిత యువకుడు గత ఏడాది ఆగస్టు 23న ఆర్యసమాజంలో పారిపోయి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. మరుసటి రోజు వారి వివాహాన్ని లక్నోలో నమోదు చేసుకున్నారు.

అయితే అమ్మాయి మేనమామ తన మేనకోడలు అపహరణకు గురైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దళిత యువకుడి కుటుంబం, అతడి సోదరుడు, బావ మరిదిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇక దళిత కుటుంబం హైకోర్టులో అరెస్ట్ చేయవద్దని పిటీషన్ వేయగా.. అమ్మాయిని కోర్టు ముందు ఉంచారు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేసింది.ఆ తర్వాత గత ఏడాది అక్టోబర్ 9న విడిపోయిన తర్వాత ప్రేమించిన వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఆ యువకుడి సోదరుడు, బావమరిది పై ఈబీసీ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో అబ్బాయి కుటుంబ సభ్యులు అరెస్ట్ కాకుండా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో తనను అరెస్ట్ చేస్తారనే మనస్థాపంతో దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాధిత కుటుంబం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

అమ్మాయి ఇష్టానుసారంగా యువకుడితో వచ్చి కాపురం చేసిందని పెళ్లి రిజిస్ట్రేషన్ జరిగిందని.. ఎలా లైంగిక వేధింపులకు పాల్పడుతారంటూ వాదించారు. దీంతో ఈ కేసులో దళిత యువకుడి కుటుంబం అరెస్ట్ కాకుండా సుప్రీం కోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది.