Begin typing your search above and press return to search.

కరోనా మీద పెద్ద యుద్ధమే చేస్తున్న సెక్స్ వర్కర్లు

By:  Tupaki Desk   |   2 April 2020 3:40 PM IST
కరోనా మీద పెద్ద యుద్ధమే చేస్తున్న సెక్స్ వర్కర్లు
X
సమాజంలో చిన్నచూపు.. చులకనభావం ఎక్కువగా ఉండే వర్గంగా సెక్స్ వర్కర్లను చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో చాలా రోగాలకు వారే కేరాఫ్ అడ్రస్ గా అభివర్ణించే వారు లేకపోలేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ.. తమిళనాడుకు చెందిన కొందరు సెక్స్ వర్కర్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. కరోనా పిశాచి మీద పోరాటం చేస్తున్న వారిని అభినందించకుండా ఉండలేం.

చెన్నైకి చెందిన ముప్ఫై ఏళ్ల సెక్స్ వర్కర్ ఒకరు.. గతంలో తన వద్దకు వచ్చిన వారందరికి పేరు పేరునా ఫోన్ చేసి.. కరోనా వేళ జాగ్రత్తగా ఉండాలని చెప్పటమే కాదు.. ఎలా వ్యవహరించాలి? ఏమేం చేయాలి? ఇళ్లల్లోనే ఎందుకు ఉండాలన్న విషయం మీద అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రోజుకు ఎనిమిది.. తొమ్మిది ఫోన్ కాల్స్ చేసి వివరిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.

తమిళనాడుకు చెందిన మరో సెక్స్ వర్కర్ అయితే.. కరోనా వేళ.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ.. కొన్ని వీడియోల్ని పోస్టు చేస్తున్నారు. ఒకప్పుడు జబ్బులు అంటించే వారిలో సెక్స్ వర్కర్లు ముందు ఉంటారనే నానుడికి భిన్నంగా తమిళనాడు కు చెందిన పలువురు సెక్స్ వర్కర్లు.. కరోనా మీద పెద్ద యుద్ధమే చేస్తున్నట్లు చెబుతున్నారు. వీరు చేస్తున్న ప్రచారం.. అవగాహన ప్రజల్లో మర్పునకు కారణమవుతుందని చెబుతున్నారు. ఏమైనా.. తమకెందుకులే అన్నట్లు ఊరుకోకుండా.. తమ చుట్టు ఉన్న వారికి సాయం చేయాలన్న తపనను అభినందించాల్సిందే.