Begin typing your search above and press return to search.

సెల్ ఫోన్ లోనే శృంగారం కానిచ్చేస్తున్నారుగా!

By:  Tupaki Desk   |   7 Feb 2020 3:30 AM GMT
సెల్ ఫోన్ లోనే శృంగారం కానిచ్చేస్తున్నారుగా!
X
శృంగారం లేనిదే సృష్టి లేదు.. ‘శృంగారం’ ప్రకృతి మనకు అందించిన ఓ గొప్పవరం. అయితే కొందరు శృంగారం(సెక్స్) గురించి మాట్లాడాలంటేనే సిగ్గుపడుతుంటారు.. మరికొందరు అదేదో నేరమైనట్టు చూస్తుంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. యువత సెక్స్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు అనే అంశంపై అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ సర్వే చేపట్టింది. ఇందులో కొన్ని నమ్మశక్యం నిజాలు వెలుగు చూశాయి..

* ప్రతీ పనికి సెల్ ఫోనే ఆధారం..

ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగం నుంచి ‘స్మార్ట్ ఫోన్’ యుగంలోకి మారాము. ప్రతీ ఒక్కరి ఇంట్లో మరుగుదొడ్డి ఉందో లేదోకానీ సెల్ ఫోన్ మాత్రం ఉంటుంది. యువత చేతుల్లో ఖరీదైన ‘స్మార్ట్ ఫోన్లు’ కన్పిస్తుంటాయి. ప్రపంచంలో ఏ ఎక్కడా ఏ విషయం జరిగిన క్షణాల్లో తమ సెల్ ఫోన్లలో వీక్షిస్తుంటారు. ప్రస్తుతం యాప్ లు కూడా అందుబాటులోకి రావడంతో ఇంటి నుంచి కదలకుండానే తమ పనులన్నీ యాప్ ల ద్వారా చేసుకుంటున్న వైనం మన కళ్ల ముందే చూస్తున్నాం. సెల్ ఫోన్ రాకతో పనులన్నీ సులభతరం అయ్యాయనే చెప్పొచ్చు. కరెంట్ బిల్లు - రేషన్ బిల్లు - రీచార్జ్ వంటి వాటికి సెల్ ఫోన్ ఎలాగైతే వాడుతున్నాడో.. శృంగానికి కూడా సెల్ ఫోన్ అలానే వాడేస్తున్నారు. నేటి యువత ‘శృంగార’ ఫోనయా నామః అనే మంత్రాన్ని జపిస్తున్నారు.

* ఆ పనికి కూడా సెల్ ఫోనే..

అమెరికాలో చేసిన ఈ సర్వేలో పాల్గొన్న యువత చెప్పిన విషయాలు కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. సెక్స్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకునేందుకు యువత సెల్ ఫోన్ నే అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. వాట్సాప్ - సోషల్ మీడియా తదితర అప్లికేషన్స్ ఉపయోగిస్తూ సెక్స్ చాట్ చేస్తున్నారట. అంతేకాకుండా వీటికి ఇప్పటికే చాలామంది బానిసలుగా మారిపోయారట. అంతేకాకుండా నగ్నంగా అమ్మాయిలు - అబ్బాయిలు ఫొటోలు - వీడియోలను షేర్ చేసుకుంటున్నారని ఈ సర్వేలో ఒప్పుకున్నారు. కొందరు తామ పార్టనర్ తో సెక్స్ లో పాల్గొనప్పుడు వీడియోలను తీసుకొని వారు దూరంగా ఉన్న సమయంలో వాటిని చూస్తూ సంతృప్తి చెందుతున్నారని ఆ సర్వేలో వెల్లడైంది. అవి అలా లీక్ అయ్యి పోర్న్ వెబ్ సైట్లకు చేరుతున్నాయని కొందరు వాపోతున్నారు కూడా..

*అప్రమత్తంగా ఉండకపోతే అంతే సంగతులు..

ఇలాంటి విషయాలు వెలుగుచూడటంతో అమెరికాకు చెందిన సర్వే సంస్థ యువతకు కొన్ని సూచనలు చేసింది. వీటిని పాటిస్తే సమస్యలకు దూరంగా ఉండొచ్చని పేర్కొంది. సెక్స్ కు సంబంధించిన విషయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. నగ్నంగా ఫొటోలు - వీడియోలు షేర్ చేసుకుంటే అవి వేరేవారికి చేరే అవకాశం ఉంది. దుండగుల చేతికి ఆ వీడియోలు వెళ్లినట్లయితే ఆర్థికంగా నష్టపోవడంతోపాటు, ఒక్కోసారి ప్రాణహాని కలుగవచ్చు. అందువల్ల నగ్న చిత్రాలకు - వీడియోలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సూచిస్తుంది. ఇలాంటి విశృంఖల చర్యలు పెరగడం వల్ల ఇటీవల కాలంలో క్రైమ్ రేట్ పెరిగిందని.. ప్రతిఒక్కరూ సెల్ ఫోన్ సెక్స్ కు దూరంగా ఉండాలని పేర్కొంది. నేటి యువత ఇలాంటి ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే రానున్న శృంగారం అంగట్లో దొరకే వస్తువుగా మారిపోవడం ఖాయంగా కన్పిస్తుంది. సెల్ ఫోన్ ను కనిపెట్టింది మనసుల మధ్య దూరాన్ని తగ్గించానికేగానీ శృంగారంలో దూరాన్ని పెంచడానికి కాదని తెలుసుకొని అందుకు తగ్గట్టు వ్యవహరిస్తే అందరికీ మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.