Begin typing your search above and press return to search.

జేసీ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి!!

By:  Tupaki Desk   |   24 Dec 2020 10:21 AM GMT
జేసీ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి!!
X
అనంతపురంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులకు.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ గొడవకు సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారమే కారణమని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో కిరణ్ అనే వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని విమర్శిస్తున్నాడని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దారెడ్డి అనచరులు వాహనాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. అక్కడే ఉన్న కిరణ్ పై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే అక్కడే ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కూడా ఎదురుదాడికి దిగడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు భారీగా రాళ్లదాడి చేసుకున్నాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురి తలలు పగిలాయి.

పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో పెద్దారెడ్డి కూర్చీని జేసీ అనుచరులు తగులబెట్టి హంగామా చేసినట్టు సమాచారం. దాడి నేపథ్యంలో జేసీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయినట్టు సమాచారం.