Begin typing your search above and press return to search.

చిన్నారుల్లో తీవ్ర కరోనా.. కారణాలేంటో తెలిస్తే షాకవుతారు!

By:  Tupaki Desk   |   4 May 2022 2:30 AM GMT
చిన్నారుల్లో తీవ్ర కరోనా.. కారణాలేంటో తెలిస్తే షాకవుతారు!
X
కొంత మంది చిన్నారులు తీవ్ర కొవిడ్-19 బారిన పడుతున్నారు. అయితే ఇందుకు గల కారణాలను గురించి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రుగ్మతను త్వరగా గుర్తించడానికి, మరింత మెరుగైన ఔషధాలను అభివృద్ధి చేయడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని వారు తెలిపారు. అయితే ప్రజలంతా వీటిపై అవగాహన పెంచుకుంటే పిల్లలను ఎలాంటి రోగాల బారిన పడకుండా సులువుగా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

తీవ్ర కొవిడ్ బారిన పడ్డ చిన్నారుల్లో మల్టీ సిస్టమ్ ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్ తలెత్తుతుందట. ఫలితంగా గుండె, ఊపిరితిత్తులు, మెదడులో ఇన్ ఫ్లమేషన్ వస్తుంది. అలాగే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనే ఒకరం ఊపిరితిత్తుల వ్యాధి కూడా ఉత్పన్నం కావచ్చని వివరిస్తున్నారు. చిన్నారులకు సాధారణంగా కరోనా ముప్పు తక్కువ. వారిలో స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తాయి. అయితే కొందరిలో వ్యాధి తీవ్ర రూపం దాల్చడానికి కారణాల పై అస్పష్టత నెలకొంది.

రక్తం గడ్డ కట్టడం, రోగ నిరోధక వ్యవస్థ లోని ప్రోటీన్ల చర్యా క్రమం ఇందుకు కారణం అవుతున్నట్లు తాము అంగీకరించామని పరిశోధనలో పాలు పంచుకున్న మెక్ క్యాఫెటీ పేర్కొన్నారు. తీవ్ర కొవిడ్ బారిన పడ్డ పిల్లల్లో ఉత్పన్నమైన మల్టీ సిస్టమ్ ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్ లక్షణాలు కవాసాకి వ్యాధి, టాక్సిక్ షాక్ సిండ్రోమ్ బాధితుల్లో కనిపించే లక్షణాలను పోలి ఉంటున్నాయని వివరించారు. వీరిలో జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, చర్మంపై దద్దుర్లు, కళ్లకు ఇన్ ఫెక్షన్లు వంటివి ఉన్నాయని తెలిపారు.

కాబట్టి మీ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. అన్ని పరీక్షలు చేయించి మెరుగైన చికిత్స అందించాలని వివరిస్తున్నారు. పిల్లల్లో కొవిడ్ తీవ్ర రూపం దాలిస్తే... అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని... కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ముందు జాగ్రత్తగా... అత్యవసరమైతే తప్ప బయటకు తీసుకెళ్లకూడదని ఒకవేళ తీసుకెళ్లినా మాస్క్ పెట్టి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.

కరోనా వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తల కంటే రాకుండా చూస్కోవడమే మంచి పద్ధతని వివరిస్తున్నారు. అంతే కాదండోయ్ ఇఫ్పుడిప్పుడే పిల్లలకు కరోనా టీకాలు వస్తున్నాయని... పిల్లల వయసు ఆధారంగా వారికి వీలయినంత త్వరగా టీకాలు వేయించాలని సూచిస్తున్నారు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఎక్కువగా పెట్టాలని రోజూ పాలు, గుడ్డు, మాంసం వంటివి తినిపిస్తూ... వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అలాగే టీకాలు వేయించిన తర్వాత కూడా కరోనా సోకకుండా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.