Begin typing your search above and press return to search.
ఆంధ్రా ఉద్యోగులు వద్దు.. ఆంధ్రా నీళ్లు కావాలా?
By: Tupaki Desk | 4 July 2019 10:41 AM ISTతెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తెలంగాణ హక్కుల గురించి జరిగిన పోరాటాలు చాలానే ఉన్నా.. ఆంధ్రాఉద్యోగుల పేరుతో జరిగిన ప్రెస్ మీట్లు కాస్త తక్కువే. అలాంటిది తాజాగా తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లు చేపట్టిన మీడియా సమావేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలంగాణలో వద్దే వద్దు.. వాళ్లను ఒప్పుకోమంటూ తేల్చి చెబుతూ ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణలోనా? అంటూ సంధించిన ప్రశ్న ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో వద్దే వద్దని.. ఏ రాష్ట్రం వారు అక్కడే పని చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణలో ఎందుకు ఉన్నారు? వారెందుకు ఆంధ్రాకు వెళ్లటం లేదు? ఆంధ్రా వారిగా చెబుతున్న వారి వాదన ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థ 1157 మంది ఏపీ ఉద్యోగులంటూ రిలీవ్ చేశారు. అయితే.. ఇలా రిలీవ్ అయిన వారిని ఆంధ్ర రాష్ట్రం కూడా తమ వాళ్లు కాదని చెబుతోంది. దీంతో.. వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇదే అంశం కోర్టు దృష్టికి వెళ్లగా.. రెండు రాష్ట్రాల వారు వాటాల ప్రకారం వారికి జీతాలు ఇవ్వాలని తేల్చారు. అలా జీతాలు ఇస్తున్నారు కూడా.
ఇక్కడ కీలకాంశం ఏమంటే.. ఎవరినైతే రిలీవ్ చేశారో.. వారంతా కూడా తెలంగాణలో మైగ్రేట్ అయి వచ్చిన వారో.. వారి తల్లిదండ్రులు వచ్చిన వారే కావటం గమనార్హం. అయితే.. మూలాలే మాకు ముఖ్యం మరింకేమీ కాదని వాదించే తెలంగాణ ఇంజనీర్లు ఎందుకంత పట్టుదలతో ఉన్నారంటే..రిలీవ్ అయిన 1157 మంది ఉద్యోగులు ఉన్నత స్థానంలో ఉన్న వారే కావటం. వారికి కానీ పోస్టింగులు ఇస్తే.. తాము అత్యుత్తమ స్థానాలకు చేరేందుకు వీలు కాదన్నవేదనే.. వారి చేత ఇలా మాట్లాడిస్తుందని చెప్పాలి. మరి.. ఏపీ ఎందుకు ఒప్పుకోవటం లేదంటే.. నిజంగానే మా వాళ్లు అయితే మేం తీసుకోవటానికి మాకేం ఫర్లేదు. కానీ..వారి మూలాలు ఏపీనే.. కానీ వారు ఏళ్లకు ఏళ్లుగా తెలంగాణ ప్రాంతంలో సెటిల్ అయ్యాక.. వారిని ఏపీ వాళ్లు అని వెనక్కి పంపటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ తెలంగాణ ఇంజనీర్ల సంఘం వారి వాదనే సరైనదే అయితే.. ఈపాటికి కోర్టు తన నిర్ణయాన్ని ఎప్పుడో చెప్పేసేదే కదా? సున్నితమైన అంశాలు ముడిపడి ఉండటమే.. కోర్టు సైతం తన నిర్ణయాన్ని ప్రకటించకుండా ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. రిలీవ్ అయిన ఉద్యోగులు ఆంధ్రానా? తెలంగాణనా? అన్నది తేలాల్సి ఉంది. అదేమీ కాకుండా.. ఆంధ్ర బ్రాండ్ వేసేసి నినాదాలు చేయటం వల్ల అనవసరమైన భావోద్వేగాల్ని తట్టి లేపినట్లు అవుతుంది.తమకు సంబంధం లేని విషయంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు మాటలు అనిపించుకోవాల్సి ఉంటుంది. కోర్టులో ఉన్న విషయం మీద ఎవరికి వారు తీర్పులు ఇచ్చేయటం కూడా భావ్యం కాదు. సంయమనం పాటించాల్సిన అవసరం ఉంద్నది మర్చిపోకూడదు.