Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ కు సర్కారుకు సీరం.. భారత్ బయోటెక్ ఏం చెప్పాయి?

By:  Tupaki Desk   |   15 Jan 2021 1:00 PM IST
వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ కు సర్కారుకు సీరం.. భారత్ బయోటెక్ ఏం చెప్పాయి?
X
అత్యవసర వినియోగం కోసం అనుమతులు పొందిన కోవిషీల్డ్.. కోవాగ్జిన్ టీకాల్ని రేపటి నుంచి దేశ వ్యాప్తంగా వేస్తున్న సంగతి తెలిసిందే. తొలిదశలో వైద్యులు.. వైద్య సిబ్బంది.. ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ కు అనుమతి పొందే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీలు ఎలాంటి హామీలు ఇచ్చాయి. అంతా బాగుంటే అందరూ హ్యాపీ.

అలా కాకుండా అనుకోనిది ఏదైనా జరిగితే.. వ్యాక్సిన్ కారణంగా సైడ్ ఎఫెక్టులుచోటు చేసుకుంటే? అన్న సందేహాలకు సమాధానం వచ్చేసింది. అమెరికా.. యూకేలో వ్యాక్సిన్ రూపొందించిన కంపెనీలు ఎలా అయితే.. రిస్క్ కు రెఢీ అన్నాయో.. దేశంలో వ్యాక్సిన్ సిద్ధం చేసిన సీరమ్.. భారత్ బయోటెక్ రెండు కంపెనీలు అలాంటి మాటనే కేంద్రానికి చెప్పాయి.

వ్యాక్సిన్ కారణంగా ఏదైనా డ్యామేజ్ జరిగినా.. అనుకోనిది ఏమైనా జరిగితే.. అందుకు జరిగే నష్ట పరిహారాన్ని తాము చెల్లిస్తామని అనుమతి పత్రం కోసం పెట్టుకున్న దరఖాస్తులో స్పష్టంగా పేర్కొన్నారు. డీసీజీఐ పాలసీలో భాగంగా చేసిన అగ్రిమెంట్ లో అనుకోనిది ఏదైనా జరిగితే.. తాము ప్రభుత్వానికి ముందుగానే సమాచారం అందిస్తామని.. దాని కారణంగా జరిగే నష్టానికి బాధ్యత వహిస్తామన్న హామీని ఇచ్చాయి. యూకేలో ఫైజర్ వ్యాక్సిన్ అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పుడు.. ఇదే తరహాలో హామీ ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ పై ఉన్న సందేహాలు.. అనుమానాలు.. భయాల్ని పోగొట్టేలా ప్రభుత్వం ప్రచారం చేపట్టాలని సీరం సీఈవో ఆదార్ పూనావాలా కోరారు. అంతేకాదు.. వ్యాక్సిన్ కారణంగా ఏదైనా దుష్ప్రభావం చోటు చేసుకుంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా తామే ఆ అంశాల్ని పరిష్కరిస్తామని చెబుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.