Begin typing your search above and press return to search.

ఆ కంపెనీల లాగే మాకు రక్షణ కల్పిచాలన్న సీరం

By:  Tupaki Desk   |   3 Jun 2021 10:30 AM GMT
ఆ కంపెనీల లాగే మాకు రక్షణ కల్పిచాలన్న సీరం
X
దేశంలో మొట్టమొదటి టీకా ఉత్పత్తిదారు అయిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాజాగా కేంద్రం నిర్ణయంపై స్పందించింది. డిసెంబర్ చివరి నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్రం విదేశీ వ్యాక్సిన్లపై తీసుకున్న నిర్ణయంపై కోవిషీల్డ్ యాజమాన్యం గుర్రుగా ఉంది.

విదేశీ టీకాలతో ఏదైనా ఉపద్రవాలు ఎదురైతే విదేశీ సంస్థలకు రక్షణ కల్పిస్తామన్న భారత ప్రభుత్వం తీరుపై సీరం స్పందించింది. సీరంకు మాత్రమే కాదు.. అన్ని దేశీయ టీకా కంపెనీలకు విదేశీ టీకా కంపెనీలకు వర్తింప చేసిన సూత్రాన్ని అమలు చేయాలని సీరం సంస్థ కేంద్రాన్ని కోరింది. వ్యాక్సిన్ తయారీదారులందరికీ ఒకే సూత్రాలు వర్తింపచేయాలని సీరం సీఈవో అదర్ పూనావాలా కేంద్రాన్ని కోరారు.

వ్యాక్సిన్ ట్రయల్స్ సందర్భంగా ఏదైనా జరిగితే కేంద్రప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని.. న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలని విదేశీ టీకా సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనిపై హామీ ఇవ్వాలని అమెరికా ఫార్మా సంస్థలు మోడెర్నా, ఫైజర్ లు విన్నవించాయి.

ఈ క్రమంలోనే దేశంలో అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చేందుకు నిబంధనలు సడలించింది. విదేశాల్లో అనుమతి పొందిన వ్యాక్సిన్లను మన దేశంలో వాడేందుకు ట్రయల్స్ అవసరం లేదని విదేశీ టీకాలకు లైన్ క్లియర్ చేసింది. అయితే ఇదే నియమాన్ని నిబంధనలకు దేశీయ టీకా కంపెనీలకు వర్తింపచేయాలని దేశీయ టీకా దిగ్గజం సీరం సంస్థ డిమాండ్ చేస్తోంది.