Begin typing your search above and press return to search.

క‌రోనా వ్యాక్సిన్‌.. ఆ సంస్థ కాన్ఫిడెన్స్ చూశారా?

By:  Tupaki Desk   |   3 Aug 2020 2:30 AM GMT
క‌రోనా వ్యాక్సిన్‌.. ఆ సంస్థ కాన్ఫిడెన్స్ చూశారా?
X
ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మెజారిటీ దేశాల బాధ క‌రోనానే. అగ్ర రాజ్యం అమెరికా.. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం అయిన భార‌త్ స‌హా ఎన్నో దేశాలు కరోనా ధాటికి అల్లాడిపోతున్నాయి. ఈ మ‌హ‌మ్మారి ధాటికి దేశాల ఆర్థిక పునాదులే క‌దులుతున్నాయి. జ‌నాల క‌ష్టాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది. ఈ క‌ష్టాల‌న్నీ పోవాలంటే వ్యాక్సిన్ రావాలి. వైర‌స్‌ను పార‌దోలాలి. దాని కోస‌మే అంద‌రూ ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తే దానికుండే డిమాండ్ ఎలాంటిదో చెప్పాల్సిన ప‌ని లేదు. దీని మీద‌ ల‌క్ష‌ల కోట్ల వ్యాపారం జ‌రుగుతుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 150కి పైగా సంస్థ‌లు క‌రోనా వ్యాక్సిన్ త‌యారు చేసే ప్ర‌య‌త్నంలో ఉంటే అందులో ప‌దిశాతం దాకా ఆ దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులేస్తున్నాయి.

భార‌త్ విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ భార‌త్ బ‌యోటెక్‌తో పాటు మ‌రో సంస్థ వ్యాక్సిన్ త‌యారీలో చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇక పుణెకు చెందిన సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ సొంతంగా వ్యాక్సిన్ త‌యారు చేయ‌క‌పోయినా.. అందులో ముందంజ‌లో ఉన్న ఐదు సంస్థ‌ల‌తో ఒప్పందం చేసుకుంది. ఆ ఐదింట్లో క‌రోనా వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను చివ‌రి ద‌శ‌కు తీసుకెళ్లిన ఆక్స్‌ఫర్ట్ యూనివ‌ర్శిటీ కూడా ఉంది. వాళ్లు త‌యారు చేసిన ఫార్ములాతో సీర‌మ్ సంస్థ ఇప్ప‌టికే ఇండియాలో కూడా వ్యాక్సిన్ తయారీ మొద‌లుపెట్టేసింది. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కూడా మొద‌లుపెట్టింది. ఈ వ్యాక్సిన్ క‌చ్చితంగా విజ‌య‌వంతం అవుతుంద‌న్న విశ్వాసంతో తాము కోట్ల సంఖ్య‌లో వాక్సిన్ డోసుల ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు దాని అధినేత అద‌ర్ పూన‌వాలా చెప్ప‌డం విశేషం. ఈ ఏడాది చివ‌ర్లోపు ఇండియాలో క‌రోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వ‌స్తుంద‌ని.. దాన్ని సాధ్య‌మైనంత త‌క్కువ ధ‌ర‌కు ఇస్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.