Begin typing your search above and press return to search.

మరో 20 ఏళ్లు కరోనా టీకా ఉండాల్సిందే : సీరం సీఈఓ పూనావాలా

By:  Tupaki Desk   |   23 Oct 2020 4:20 PM IST
మరో 20 ఏళ్లు కరోనా టీకా ఉండాల్సిందే : సీరం సీఈఓ పూనావాలా
X
కరోనా వైరస్ .. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ఒక్కొక్క దేశానికి వ్యాపించి , మొత్తంగా ప్రపంచం మొత్తం వ్యాపించింది. ప్రపంచ దేశాల అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా కూడా కరోనా దెబ్బకి గజగజ వణికిపోతోంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు అమెరికాలోనే నమోదు అయ్యాయి. అలాగే ఇప్పటికి కూడా అమెరికాలో కరోనా మహమ్మారి ప్రభావం చూపిస్తూనే ఉంది. అలాగే రోజూ కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 41.7 మిలియన్ కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1. 14 మిలియన్ మంది కరోనాతో మరణించారు. రోజురోజుకి కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తూనే ఉంది. దీన్ని అరికట్టాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. కరోనా ను అరికట్టే వ్యాక్సిన్ వస్తే తప్ప , కరోనాను అరికట్టే పరిస్థితి లేదు. దీనితో ప్రపంచంలోని పలు దేశాల నిపుణులు ఈ కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అతి త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అని పలువురు నిపుణులు చెప్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సీరం సీఈఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికే 20 ఏళ్ల పాటు కరోనా టీకా అవసరం ఉంటుందని సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో ఆధార్ పూనావాలా వ్యాఖ్యానించారు. జనాభాలో 100 శాతానికి కరోనా టీకా ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ వైరస్ ఒక్కటే పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. మనం ఎన్నో టీకాలను కనిపెట్టాం. కానీ ఏదీ కూడా పూర్తిగా నిలిపి వేసిన చరిత్ర లేదని గుర్తు చేశారు. ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి వ్యాక్సిన్ తీసుకోవాల్సి రావచ్చు అని హెచ్చరించారు. ప్ర‌పంచం మొత్తానికి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ను అందించేందుకు నాలుగైదు సంవత్సరాల పడుతుందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా తెలిపారు.