Begin typing your search above and press return to search.

మే నెల నాటికే దేశంలో 64 లక్షల మందికి కరోనా

By:  Tupaki Desk   |   12 Sep 2020 2:30 AM GMT
మే నెల నాటికే దేశంలో 64 లక్షల మందికి కరోనా
X
దేశంలో కరోనా ఇప్పుడు జెట్ స్పీడుతో పరిగెడుతోంది. గత 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 96వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో దేశంలో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం.దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 45 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 76271కి చేరింది.

అయితే భారత్ లో కరోనా వేవ్ ఇప్పుడే కాదు.. లాక్ డౌన్ ఉన్న సమయంలోనే మొదలైందని ఐసీఎంఆర్ అంచనావేసింది. మే నెల నాటికే దేశంలో 64 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని తెలిపింది.

దేశవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. మే నెల ఆరంభంలో దేశవ్యాప్తంగా సుమారు 64,68,388 మందికి కరోనా సోకి ఉంటుందని సీరో సర్వే సంస్థ నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ లో వివరాలను ప్రచురించారు.

21 రాష్ట్రాల్లోని సుమారు 28వేల మంది రక్తనమూనాలు పరీక్షించి ఈ మేరకు నిగ్గుతేల్చారు. మే, జూన్ నెలల్లో గ్రామీణ ప్రాంతాలకు వైరస్ ప్రబలిందని గుర్తించారు.

మే నెలలో సగటున 82-130మందికి కరోనా సోకిందని ఐసీఎంఆర్ తెలిపింది. మే నెల వరకు జనాభాలో కేవలం 1శాతం మంది ఈ వైరస్ సంక్రమించిందని పేర్కొంది.