Begin typing your search above and press return to search.

సీరియస్ పొలిటీషియన్.. కమేడియన్ గా కొత్త అవతారం

By:  Tupaki Desk   |   15 Nov 2019 10:41 AM IST
సీరియస్ పొలిటీషియన్.. కమేడియన్ గా కొత్త అవతారం
X
షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. సీరియస్ పాలిటిక్స్ తో పాటు.. పలు అంశాలపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యే మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కొత్త అవతారం ఎత్తారు. మేధావి వర్గానికి చెందిన రాజకీయ నేతగా ఆయన కో ఇమేజ్ ఉంది. సీనియర్ కాంగ్రెస్ నేతగా అందరికి సుపరిచితమైన ఆయన.. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో ప్రసార మయ్యే వన్ మైక్ స్టాండ్ అనే కామెడీ షో లో కమెడియన్ అవతారమెత్తారు.

అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు (శుక్రవారం) ప్రసారం కానున్న ఈ షోకు సంబంధించి వివరాలు ఆసక్తి కరంగా మారాయి. ఈ స్టాండప్ షో లో మొత్తం ఐదుగురు సెలబ్రెటీలు.. మరో ఐదుగురు ప్రొఫెషనల్ కమెడియన్స్ తో పోటీ పడతారు. శశిథరూర్ తో పాటు.. నటీ మణులు తాప్సీ.. రిచా చద్దా.. గాయకుడు విశాల్ దద్లాని తదితరులు ఉన్నారు. స్టాండప్ కమెడియన్స్ జాబితా లో సపన్ వర్మ.. రోహాన్ జోషి లాంటోళ్లు ఉన్నారు.

తాను నటించిన ఈ కామెడీ షోకు సంబంధించిన నిమిషం నిడివి ఉన్న వీడియో ను శశిథరూర్ తన ట్విట్టర్ ఖాతా లో ట్వీట్ చేశారు. ఈ బుల్లి వీడియో లో తన ఇంగ్లిషు గురించి.. తాను ఉపయోగించే సంక్లిష్టమైన పదాల పైనా జోకులు వేస్తూ సరదా గా కనిపించారు. ఇంతకాలం సీరియస్ అంశాల మీద యమా సీరియస్ గా కామెంట్ చేసే మాజీ కేంద్రమంత్రి ఒకరు తనకు ఏ మాత్రం సంబంధం లేని కామెడీ షో లో పాల్గొనటం.. ఈ షో అందరి కంట్లో పడేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.