Begin typing your search above and press return to search.

కోర్టు లోనే కాదు.. ఆమె బయటా చిరుతే

By:  Tupaki Desk   |   6 Nov 2015 10:33 AM IST
కోర్టు లోనే కాదు.. ఆమె బయటా చిరుతే
X
తన దూకుడుతో ప్రత్యర్థికి చెమటలు పట్టించే టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. ప్లే గ్రౌండ్ లోనే కాదు.. బయటా తానేంటో నిరూపించుకున్నాడు. టెన్నిస్ కోర్టులో తన బలమైన షాట్లతో టెన్నిస్ అభిమానుల్ని అలరించే ఆమె.. రియల్ జీవితంలో ‘సూపర్ హీరో’గా వ్యవహరించటం విశేషం.

అమెరికాకు చెందిన ఈ నల్లకలువ భామ.. స్థానిక చైనీస్ రెస్టారెంట్ కు వెళ్లారు. తనకు సమీపంలో ఒక వ్యక్తిపై ఆమెకు అనుమానం కలిగింది. అతగాడిపై ఓ కన్నేసి ఉంచింది. ఆమె ఊహించినట్లు సదరు ఆగంతకుడు ఆమె ఫోన్ ను పట్టుకొని ఉడాయించాడు. ఒక్కసారి అలెర్ట్ అయిన ఆమె.. వెంటనే పెద్దగా కేకలు వేసి.. అతడి వెంట పడింది.

టెన్నిస్ కోర్టులో చిరుతలా కదిలే ఆమె.. తాజా ఘటనలో కూడా అదే రీతిలో రియాక్ట్ అయ్యింది. అత్యంత వేగంగా దూసుకెళ్లి తన ఫోన్ ను దొంగలించిన దొంగను చేధించటమే కాదు.. అతగాడికి రెండు పంచ్ లు ఇచ్చి తన ఫోన్ ను తాను తీసేసుకొంది. ఈ ఛేజ్ సీన్ మొత్తాన్ని చూసిన రెస్టారెంట్ లోని వారు ఆమెకు..‘‘స్టాండింగ్ ఓవేషన్’’ ఇచ్చినట్లుగా ఆమె తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొంది. అంతేకాదు.. తాజా ఘటనను ఆమె ఆడోళ్ల విజయంగా అభివర్ణించారు. ఒక మహిళగా అస్సలు భయపడొద్దని.. సవాలు ఎదురైనప్పుడు బాధితురాలిగా కాకుండా హీరోగా ఉండాలని కోరింది. ఇప్పటివరకూ టెన్నిస్ కోర్టులోనే సెరీనా దూకుడ్ని చూసిన వారికి.. రియల్ లోనూ తానేంటో చూపించి అందరి మనసుల్ని మరోసారి గెల్చుకుందీ భామ.