Begin typing your search above and press return to search.

మంకీఫాక్స్ పై గ్లోబల్ కేస్ స్టడీ షాకింగ్ నివేదిక: ఆ సెక్స్ వల్లే..

By:  Tupaki Desk   |   23 July 2022 11:30 AM GMT
మంకీఫాక్స్ పై గ్లోబల్ కేస్ స్టడీ షాకింగ్ నివేదిక: ఆ సెక్స్ వల్లే..
X
దేశంలో కొత్తగా మంకీ ఫాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో మరెన్ని కేసులు నమోదవుతవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో కరోనా కూడా కేరళతోనే ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత దేశ వ్యాప్తంగా విస్తరించింది. అయితే కరోనా వైరస్ తుంపర్లు, టచ్ చేయడం వల్ల విస్తరించింది.

కానీ మంకీఫాక్స్ విస్తరించడానికి కారణం గే సెక్స్ అని వైద్యలు చెబుతున్నారు. ముంబయ్ కి చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఈశ్వర్ గిలాడా ఈ వైరస్ ఎలా సోకుతుందో చెబితే ఒకరకమైన వివక్ష ఏర్పడుతుందని డబ్ల్యూ హెచ్ వో చెప్పడం లేదని అన్నారు. అలాగే ఎయిడ్స్ చెందిన వ్యాధిగానే దీనిని పరిగణించవచ్చని పేర్కొన్నాడు.

అందమైన మానవ జీవితానికి కొన్ని సరైన మార్గాలుంటాయి. కొన్ని మనం సృష్టించుకున్నవైతే.. మరికొన్ని ప్రకృతి ప్రసాదిస్తుంది. పురాతన కాలం నుంచి మానవ జీవితాన్ని సులభతరం చేస్తూ కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. కానీ కొందరు ప్రకృతికి విరుద్ధంగా వెళ్తూ జీవన మనుగడకే ముప్పుగా మారుతున్నారు. వారు చేసే కొన్ని పనుల వల్ల ఇతరుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రతి ఒక్కరు ఆనందంగా జీవించాలంటై సరైన ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం తీసుకోవడానికి సక్రమమైన మార్గాన్ని అనుసరించాలి.

కానీ వికృతి పనులు చేస్తూ కొత్త కొత్త రోగాలను సృష్టిస్తున్నారు కొందరు. తాజాగా ప్రపంచాన్ని మంకీఫాక్స్ భయపెడుతోంది. భారత్ లోనూ ఈ ప్రభావం మొదలైంది. అయితే దీనిపై వైద్యులు చేసిన పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తాజాగా గ్లోబల్ కేస్ స్టడీ సిరీస్ షాకింగ్ విషయాన్ని తెలిపింది. సాధారణంగా తుంపర్లు, సంపర్కం, వ్యాధి సోకిన వారికి మంకీ ఫ్యాక్స్ విస్తరిస్తుండగా తాజాగా సెక్సువల్లీ ట్రాన్స్ మిటెడ్ డిసీజ్ గా తేలింది. 95 శాతం మంకీఫాక్స్ లైంగికంగా కలుసుకోవడం వల్లే ఈ వైరస్ సోకుతుందని గురించింది. అలాగే 98 శాతం స్వలింగ సంపర్కులు, బై సెక్సువల్ మెన్స్ తోనే ఇది విస్తరిస్తోందని తెలిపింది. అటు వైద్యులు కూడా గే సెక్స్ కు పాల్పడిన వారిలోనే విస్తరిస్తోందని పేర్కొంటున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు ఇతత దేశాల్లో 1500కు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఎక్కువగా స్వలింగ సపర్కంలో పాల్గొనే వారే బాధితులుగా ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా విషయంలో ముందు జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా వైరస్ విస్తరించింది. అయతే స్వలింగ సంపర్కరుల తమ లైంగిక చర్యతో ఈ వైరస్ ను ఎక్కువగా విస్తరిస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడానికి ఇష్టపడడం లేదని, కానీ ఎక్కువగా ఈ కేసులు నమోదు కావడానికి కారణం అదేనని అంటున్నారు. దేశంలో మంకీ ఫాక్స్ ఇప్పటి వరకు కేరళలోనే రెండు నమోదయ్యాయి. అటు విమాన ప్రయాణాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రతీ ఒక్కరినీ పరీక్షించిన తరువాత దేశంలోకి అనుమతినిస్తున్నారు.