Begin typing your search above and press return to search.
మధ్య వయస్కు మహిళల్లో సెక్సు ఆసక్తిపై సంచలన రిపోర్టు
By: Tupaki Desk | 1 Oct 2020 6:00 AM ISTకొన్ని అభిప్రాయాలు అలా ఉండిపోతాయి. మారిన కాలానికి తగ్గట్లు.. అభిరుచులు.. ఆసక్తులు మారాయన్న విషయాల్ని చాలామంది గుర్తించరు. తాజాగా అలాంటి విషయమే ఒకటి బయటకు వచ్చింది. సాధారణంగా మధ్య వయస్కు మహిళల్లో సెక్సు ఆలోచనలు తగ్గిపోతాయని.. వారు పెద్దగా ఆసక్తి చూపరన్న భావన చాలా ఎక్కువ. అయితే.. మారిన కాలానికి తగ్గట్లు వారి ఆలోచనల్లో కొత్త మార్పులు చోటుచేసుకున్న విషయాన్ని తాజాగా జరిపిన ఒక అధ్యయనం బయటపెట్టింది.
పిట్స్ బర్గ్ వర్సిటీ వైద్యులు.. నార్త్ అమెరికన్ మెనోపాజ్ సొసైటీ చేసిన ఉమ్మడి అధ్యయనం ఇప్పుడు ఆసక్తికర అంశాల్ని బయటపెట్టింది. మధ్య వయస్కు మహిళలకు సెక్సు ఆసక్తిపై ఇప్పటివరకు ఉన్న వాదనలకు భిన్నమైన విషయాలు వారి అధ్యయనంలో బయటకు వచ్చాయి. మధ్య వయసు మహిళలకు అన్నింటికంటే ఎక్కువ ఇష్టం సెక్సేనని తేల్చారు. 40 నుంచి 55 ఏళ్ల మధ్యనున్న 3200 మంది మహిళలపైఅధ్యయనం చేశారు.
వారిలో 27 శాతం మంది తాము సెక్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెబితే.. మరో 28 శాతం మంది సెక్సు ఇష్టమని చెప్పారు. నలబై దాటిన తర్వాత సెక్సు కోరికులు పెరగటం తప్పేం కాదని చెబుతున్నారు. అయితే.. ఇంతలా ఇష్టం పెరగటానికి దోహదం చేస్తున్న అంశాలు ఏమిటన్న విషయాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మధ్య వయసుకు రాగానే మెనోపాజ్ కారణంగా సెక్సు మీద ఆసక్తి అంతగా ఉండదనే అభిప్రాయం ఉండేది. అందుకు భిన్నంగా తాజా అధ్యయన ఫలితాలు ఉన్నాయి.
అమెరికాలోని తెల్లజాతి మహిళలతో పోలిస్తే.. నల్లజాతి మహిళలు సెక్సు పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తేల్చారు. దీనికి భిన్నంగా చైనా.. జపాన్ మహిళలు మాత్రం సెక్సును అంత ముఖ్యమైనదిగా భావించటం లేదట. టెన్షన్లు ఎక్కువగా ఉన్న వారు.. బాధ్యతల బరువు మోసే వారు సెక్సు పట్ల ఆసక్తి చూపించటం లేదని.. అదే సమయంలో బాగా చదువుకున్న మహిళలు.. జీవితంలో స్థిరపడిన వారు మాత్రం సెక్సుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం.