Begin typing your search above and press return to search.
అచ్చెన్నాయుడిపై సోదరుడి కుమారుడి సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 27 Feb 2021 11:00 PM ISTఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై ఆయన సోదరుడి కుమారుడు అప్పన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడ సర్పంచ్ గా పోటీచేశానని.. తనను, తన కుటుంబాన్ని వెలివేశారని ఆరోపించారు.అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్.. అతడి కుమారుడు సురేష్ పొలంలోకి కూలీలను రానివ్వకుండా అడ్డుపడుతున్నారని..పొలంలోకి వెళ్లేందుకు దారి ఇవ్వడం లేదన్నారు. కూలీలు రాక రెండు ఎకరాల్లో మినప చేను పోయిందని.. ఊరిలో మిల్లుకు వెళ్లి ధాన్యం ఆడించుకోలేని పరిస్థితి ఉందన్నారు.
ఇక గ్రామంలోనూ తనను వెలివేశారని అప్పన్న ఆవేదన వ్యక్తం చేశారు. రజకులను, నాయీ బ్రాహ్మణులను కూడా తన ఇంటికి రానివ్వడం లేదని అప్పన్న వాపోయాడు. తమ కుటుంబ సభ్యులతో కూడా ఎవ్వరూ మాట్లాడడం లేదని.. తనను చంపేస్తామని కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.నిమ్మాడలో రౌడీ పాలన కొనసాగుతోందని.. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీచేసే హక్కు లేదా అని అప్పన్న ప్రశ్నించారు. నిమ్మాడలో జరుగుతున్న అన్యాయంపై పోలీసులను ఆశ్రయిస్తానని అప్పన్న అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని అచ్చెన్న సొంత నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల్లో అచ్చెన్న సోదరుడి కుమారుడు వైసీపీ తరుఫున పోటీచేయడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదు.పంచాయతీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కింజరపు అప్పన్న బరిలో దిగాడు.. ఈ క్రమంలోనే నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ నుంచి నామినేషన్ వేసేందుకు సిద్ధమైన అప్పన్నపై అచ్చెన్నాయుడు బెదిరింపులకు దిగారు. నాడు అడ్డుకున్నారు... తన సోదరుడి కుమారుడైన అప్పన్నను నామినేషన్ వేయొద్దని.. ఫోన్ చేసి ఆపే ప్రయత్నం చేశారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక కూడా కక్ష సాధిస్తున్నారని అప్పన్న ఆరోపిస్తున్నారు.