Begin typing your search above and press return to search.
ఇక్కడ ఉరి.. అక్కడే పిస్తోల్ తో గ్యాంగ్ రేప్
By: Tupaki Desk | 8 Aug 2019 3:14 PM ISTవరంగల్ జిల్లాలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడికి వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్షను విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కామాంధుడిని ఉరితీయాలంటూ జనం రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేశారు. ఇక లాయర్లు అందరూ నిందితుడి తరుఫున వాదించకుండా నిరసన తెలిపారు. పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆధారాలు సమర్పించారు. దీంతో నిందితుడికి ఎలాంటి శిక్ష విధిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొనగా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునివ్వడం సంచలనంగా మారింది.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టైలర్ స్ట్రీట్ లోని ఓ వీధిలో జూన్ 19న తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకెళ్లిన కామాంధుడు ప్రవీణ్ అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన సంఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. హత్య చేసి పరారవుతుండగా ప్రవీణ్ ను పట్టుకొని స్థానికులు చితక్కొటి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ప్రవీణ్ కు మరణశిక్ష విధించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్తకంఠంతో ఆందోళనలు చేశారు.
దీంతో ప్రభుత్వం స్పందించి ప్రవీణ్ హత్యాచారం కేసు త్వరగా తేల్చడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. పోలీసులు సాక్ష్యాలను సేకరించారు. ప్రవీణ్ నేరాన్ని అంగీకరించాడు. 48 రోజుల పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు 30మందిని విచారించింది. ప్రవీణ్ ను నిందితుడిగా తేల్చిన వరంగల్ కోర్టు తాజాగా అతడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, మహిళా సంఘాలు , ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
* హర్యానాలో పిస్తోల్ తో బెదిరించి బాలికపై ముగ్గురి రేప్
ఇక వరంగల్ లో అత్యాచారం, హత్య చేసిన ప్రవీణ్ కు ఉరిశిక్ష పడ్డ ఘటన మరిచిపోకముందే హర్యానా రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. హర్యానాలోని పన్హానాకు చెందిన ఓ 15 ఏళ్ల బాలికను జూలై 30న ఓ యువకుడు కిడ్నాప్ చేశారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమె ఆచూకీ దొరకలేదు. బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు తన దగ్గరున్న తుపాకీతో పాయింట్ బ్లాంక్ లో పెట్టి చంపేస్తానని బెదిరించి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పలుమార్లు చేశాక తన స్నేహితులను పిలిపించి మరీ ఆమెపై రేప్ చేయించాడు. తర్వాత ఊరిబయట నిర్జీవ ప్రదేశంలో ఆమెను వదిలేసి వెళ్లగా కదల్లేని స్థితిలో బాలిక అక్కడే పడి ఉంది.
ఓపిక తెచ్చుకొని రహదారిపై కి వచ్చిన బాలిక ఓ కారును లిఫ్ట్ అడగింది. అయితే ఇచ్చిన వారు కూడా ఆమెపై లైంగిక దాడి చేసి ఊరు అవతల వదిలేశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈమె సమాచారం ఆమె తండ్రికి చేరడంతో ఆయన వచ్చి చూసి తల్లిడిల్లిపోయి ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం కొన ఊపిరితో బాలిక కొట్టుమిట్టాడుతోంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు తెలిసిన వ్యక్తియే ఈ పనిచేశాడని పోలీసులు తేల్చారు. బాలికపై రేప్ చేసిన మొత్తం ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.