Begin typing your search above and press return to search.
ఏపీలో సంచలనం.. 48 ప్రైవేటు కాలేజీల్ని రద్దు చేశారు
By: Tupaki Desk | 4 Nov 2020 11:30 AM ISTనిబంధనల్ని పాటించని కారణంగా 48 ప్రైవేటు డిగ్రీ కాలేజీల్ని రద్దు చేస్తూ ఏపీ ఉన్నత విద్యా మండలి సంచలన నిర్ణయాన్ని తీసుకుంది . ఇటీవల కాలంలో వివిధ డిగ్రీ కాలేజీలకు సంబంధించి నిబందనల్ని పాటించని వారిని గుర్తించి 246 ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విశ్వవిద్యాలయ అప్లియేషన్ లేకుండా నిర్వహిస్తుండటం.. ప్రవేశాలు లేకుండానే కళాశాలల్ని నిర్వహించడటం.. ఆడ్మిషన్లు పాతిక శాతం కంటే తక్కువగా ఉండటం లాంటి కారణాలతో ఆ కాలేజీలకు నోటీసులు జారీ చేశారు.
ఉన్నత విద్యా మండలి జారీ చేసిన నోటీసులకు వివరణ ఇస్తూ.. కాలేజీ యాజమాన్యాలు తమ ముందుకు విచారణకు రావాలని ఆదేశించారు. కొన్ని కాలేజీలు షోకాజ్ నోటీసులకు సమాధానాలు ఇస్తూ.. సంబధిత డాక్యుమెంట్లను సమర్పించారు. మరికొన్ని కాలేజీలు స్పందించలేదు. ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణకు కాలేజీ యాజమాన్యాలు హాజరు కాకపోవటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. విచారణలో తమకు వచ్చిన కమిటీ నివేదిక ఆధారంగా 48 ప్రైవేటు డిగ్రీ కాలేజీల అనుమతుల్ని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో మరో 61 కాలేజీలకు సంబంధించి కొన్ని ప్రోగ్రామ్ లను ఉపసంహరిస్తూ మండలి నిర్ణయం తీసుకుంది.