Begin typing your search above and press return to search.

వామన్ రావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   19 March 2021 5:11 PM IST
వామన్ రావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
X
తెలంగాణలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యకేసుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు తెలంగాణ జ్యూడిషియరీ పరిధిలో ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. వామన్ రావు దంపతుల హత్య అంశంలో అభ్యంతరాలను హైకోర్టు దృష్టికే తీసుకెళ్లాలని సూచించారు.

న్యాయవాద దంపతుల హత్యపై యాంటి కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ సంస్థ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వామన్ రావు దంపతుల హత్యపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరింది.తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించి రెండు పిటీషన్లు ఉన్నాయని పిటీషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే అభ్యంతరాలు ఏవీ ఉన్నా తెలంగాణ హైకోర్టు దృష్టికే తీసుకెళ్లాలని పిటీషనర్ కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరోవైపు సుప్రీంకోర్టు సూచనతో పిటీషన్ ను ఉపసంహరించుకుంది యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్.తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసు విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు కొనసాగుతున్నాయి.