Begin typing your search above and press return to search.
కార్తీకదీపం మోనితను గుర్తు చేసిందిగా?
By: Tupaki Desk | 20 Aug 2021 10:19 AM ISTసూపర్ హిట్ సీరియల్ కార్తీకదీపంలోమోనిత పాత్ర గురించి ఏ మాత్రం పరిచయం చేయనక్కర్లేదు. వంటలక్కకు ఎదురయ్యే అన్ని సమస్యలకు మోనితే కారణం. ఆమె కనుక మారితే.. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న సీరియల్ కు ఫుల్ స్టాప్ పడినట్లే. అందుకే ఎప్పటికప్పుడు మోనిత క్యారెక్టర్ లో దారుణమైన విలనిజాన్ని చూపిస్తూ.. ఎపిసోడ్లకు ఎపిసోడ్లు చుట్టేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా సంచలనంగా మారిన సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ (?) ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది.
బుల్లి తెర మీద కనిపించే మోనిత పాత్ర రియల్ లైఫ్ లో రియల్ గా చూడటం.. ఆమె తమకు వేసిన మస్కాను 48 గంటల్లో తేల్చేశారు.కార్తీక దీపంలో సీరియల్ లో మోనిత పాత్రధారి.. డాక్టర్ బాబును అమితంగా ప్రేమించటం.. అయితే వంటలక్కను డాక్టర్ బాబు పెళ్లి చేసుకోవటంతో.. తాను ప్రేమించినోడ్ని సొంతం చేసుకోవటం కోసం రకరకాలైన ప్లాన్లు వేస్తూ ఉంటుంది. తాజాగా.. తనను చంపేసినట్లుగా సీన్ క్రియేట్ చేసి.. డాక్టర్ బాబునను జైల్లో పడేసి.. తాను గుట్టుగా అండర్ గ్రౌండ్ లోకి వెళుతుంది. వంటలక్కను చంపేసి.. ఆ తర్వాత తాను కోరుకున్న డాక్టర్ బాబును సొంతం చేసుకోవాలన్నది ఆమె తాజా ప్లాన్. ఇప్పుడా సీరియల్ ఇక్కడి వరకు సాగింది.
కార్తీకదీపం మోనిత క్యారెక్టర్ ను చూసి స్ఫూర్తి చెందిందో ఏమో కానీ.. సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ ఉదంతంలో బాధితురాలిగా చెప్పే యువతి.. అద్భుతమైన నటనతో దారుణమైన నాటకం ఆడి.. తనను అత్యాచారం చేసినట్లుగా కట్టుకథ చెప్పి పోలీసులకు దిమ్మ తిరిగిపోయే షాకిచ్చింది. ఆ యువతిని ఎవరూ గ్యాంగ్ రేప్ చేయలేదని.. తాను ప్రేమించిన కుర్రాడు తనను కాదని మరో పెళ్లి చేసుకోవటంతో కక్ష పెంచుకున్న సదరు యువతి గ్యాంగ్ రేప్ దారుణ ప్లాన్ వేసినట్లుగా గుర్తించారు.
తనను చెడిపోయిన బస్సులో గ్యాంగ్ రేప్ చెప్పినట్లుగా చెప్పటంతో.. పోలీసు టీంలు ఐదేళ్లుగా చెడిపోయి.. అక్కడే ఉంచేసిన బస్సును క్షుణ్ణంగా పరిశీలించారు.అక్కడ అత్యాచారం జరిగిన ఆనవాళ్లు తర్వాత.. కనీసం.. బస్సును ముట్టుకున్నట్లుగా లేదని తేల్చారు. అంతేకాదు.. తాను చెప్పే నాటకం మరింత రక్తి కట్టేందుకు తన ఒంటిపై తానే గాయాలు చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఆమెను వైద్య పరీక్షలకు పంపగా.. అదేమీ లేదని తేలింది. చెప్పులు లేకుండా ఇంటికి వెళ్లి.. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పిన వైనంతో ఆమె తల్లితో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
యువతి ప్రేమించిన యువకుడికి అప్పటికే పెళ్లి కావటం.. ఆ పెళ్లిని పెటాకులు చేసుకొని తనను పెండ్లి చేసుకోవలని ఒత్తిడి తెస్తోంది. అయినప్పటికీ ఆ కుర్రాడు మాత్రం కాదని తేల్చి చెప్పటంతో.. పగ పెంచుకున్న యువతి.. ఈ దారుణ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఆమె ఇన్ స్టిట్యూట్ నుంచి బయలుదేరి ఇంటికి చేరిన సమయానికి.. ఆమె చెబుతున్నట్లుగా గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పటానికి మధ్య సమయాన్ని చూసి.. సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసిన సందర్భంలో పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీటిలో నిజం ఎంతన్నది తేల్చుకోవటం కోసం ఆమెను కౌన్సిలింగ్ చేయటంతో.. అసలు విషయం బయటకు వచ్చింది. అత్యాచారం జరిగిందన్న డ్రామా.. డైలీ సీరియల్ ను తలపించేలా ఉండటంతో పోలీసులు అధికారులు అవాక్కు అవుతున్నారు. ఇలాంటి ఫేక్ కంప్లైంట్ల కారణంగా.. నిజమైన బాధితుల విషయంలో పోలీసులు తప్పులు చేసే ప్రమాదం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.