Begin typing your search above and press return to search.
ఇన్చార్జికే అల్టిమేటమ్ ఇచ్చిన సీనియర్లు
By: Tupaki Desk | 12 Dec 2020 3:53 PM ISTతెలంగాణా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయమై హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్ కే దిమ్మతిరిగిపోయింది. మాణిక్కంతో సమావేశమైన అనేకమంది సీనియర్లు ఏకంగా ఆయనకే అల్టిమేటమ్ జారీ చేసినట్లు సమాచారం. సీనియర్ల మనోగతానికి విరుద్ధంగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తే పార్టీకి రాజీనామా చేసేస్తామంటూ గట్టిగానే హెచ్చరించారట. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఏ విషయంలో కూడా ఏకాభిప్రాయం సాధ్యంకాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే సీనియర్లు బాగా ఎక్కువున్న పార్టీలో ప్రతి సీనియరూ అధ్యక్షపదవికి పోటీ పడేవారే.
సీనియర్ల చాలామందిలో ఎవరికి వారే అధ్యక్ష పదవి తమకే దక్కాలని గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్న కారణంగా ఏకాభిప్రాయం ఎలా సాధ్యం ? అన్నది మాణిక్కంకు అర్ధం కావటం లేదు. ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళటానికి రెడీ అయిన ఇన్చార్జితో చాలామంది సీనియర్లు ఉదయం నుండి సమావేశం అవుతున్నారు. ఒకవైపు పీసీసీ ఆఫీసు బేరర్ల సమావేశం, మరోవైపు సీనియర్ల సమావేశం, గాంధీభవన్లో మరికొందరి భేటి ఇలా వరుసపెట్టి మాణిక్కంకు సీనియర్లు ప్యారలల్ గా సమావేశాలు నిర్వహిస్తుండటంతో పార్టీలో అసలు ఏమి జరుగుతోందో కూడా చాలామందకి అర్ధం కావటం లేదు.
ఈ ఉదయం కూడా ఇన్చార్జిని శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి, పొడెం వీరయ్య లాంటి సీనియర్ల కలిశారు. ఈ సందర్భంగా వాళ్ళు ఆయనతో మాట్లాడుతూ సీనియర్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిందేనంటూ తెగేసి చెప్పారట. అలా కాకుండా పార్టీ ఇష్టానుసారం అధ్యక్షుడిని ప్రకటిస్తామంటే కుదరదని చెప్పటం సంచలనంగా మారింది. అవసరమైతే ఇదే విషయమై ఢిల్లీకి వచ్చి అదిష్టానంతోనే తేల్చుకుంటామని కూడా మాణిక్కంతో అన్నారట.
ఇదే సమయంలో ఇన్చార్జితో సీనియర్లు, జిల్లాల అధ్యక్షుల్లో కొందరు చెప్పిన అభిప్రాయాలు మీడియాలో కనిపించటం సంచలనంగా మారింది. మీడియాకు తమ అభిప్రాయాలు ఎలా లీకయ్యాయనే విషయమై ఇఫుడు గాంధీభవన్లో పెద్ద రచ్చే జరుగుతోంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం అన్నది సాధ్యం కాదని మాణిక్కంకు కూడా బాగా తెలిసిపోయింది. మరి సాయంత్రం విమానం ఎక్కేలోపల కొత్త అధ్యక్షుడి నియామకంపై ఏదైనా సంకేతాలు ఇస్తారా ? లేకపోతే ఢిల్లీ నుండే ప్రకటన వస్తుందా అన్నది చూడాలి.