Begin typing your search above and press return to search.
జగన్‌పై మంత్రుల గరం..గరం.. రీజన్ ఇదే!
By: Tupaki Desk | 7 April 2022 5:00 PM ISTఏపీ సీఎం జగన్ అంటే.. ప్రాణం.. ఆయన మాటంటే వేదం.. అని చెప్పే.. మంత్రులు చాలా మంది ఇప్పుడు అదే జగన్ వైఖరిపై తీవ్రస్థాయిలో రుసరుస లాడుతున్నారు. ఇన్నాళ్లు ప్రతిపక్షాలు.. జగన్ తీసుకున్న నిర్ణ యాలను విమర్శిస్తే.. ఇప్పుడు. వైసీపీలోని మంత్రులే.. తప్పుపడుతున్నారు. దీనికి కారణం.. సీనియర్ మంత్రులకు ప్రాధాన్యం లేక పోవడం.. అదేసమయంలో జూనియర్లకు.. ప్రాధాన్యం ఇవ్వడమేనని చెబుతు న్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రి వర్గం రెండు మూడు రోజుల్లో మారిపోనుంది. ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఉంది.
అంతేకాదు.. వైసీపీలో ప్రస్తుతం ఉన్న మంత్రులు కూడా మానసికంగా సిద్ధమయ్యే ఉన్నారు. ఎందుకం టే.. 2019 ఎన్నికల తర్వాత.. సీఎం జగన్.. అందరికీ అవకాశాలు ఇవ్వాలంటే..కొన్ని కొన్ని నిర్ణయాలకు అంద రూ అంగీకరించాల్సి ఉంటుందని.. నేతలకు తేల్చి చెప్పారు. అంటే.. మంత్రుల్లో 90 శాతం మందిని రెండు న్నరేళ్లకు తొలగించి.. కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. అంటే.. ప్రస్తుతం మంత్రు లుగా ఉన్నవారికి ఆయన అప్పట్లోనే టైం లైన్ విధించారు. అయితే.. రెండున్నరేళ్లు అన్నది కాస్తా.. కరోనా నేపథ్యంలో మరో ఆరు మాసాలు ఎక్కువైంది.
అయితే.. ఈ క్రమంలో మంత్రులు.. పుంజుకోవడం ప్రారంభించారు. సీనియర్ మంత్రులు.. పార్టీకి, ప్రభుత్వానికి కూడా అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ.. మరకలు తుడిచే ప్రయత్నం చేశారు. ఇలాంటి వారు రాజీనామా చేస్తామని అంటున్నా.. లోలోన కొనసాగింపును కోరుతున్నారు. ఎందుకంటే.. ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. పేర్ని, ఆళ్ల నాని, పెద్దిరెడ్డి , బోత్స, కొడాలి..బాలినేని.. వంటివారు బాగానే ఫైట్ చేశారు. అదేసమయంలో సమయంలో సర్కారుకు ఇబ్బంది లేకుండా చూసుకువచ్చారు. దీంతో మంత్రి వర్గంలో కొనసాగింపును వారు కోరుకోవడం తప్పుకాదు.
కానీ, 90 శాతం మార్పు ఉంటుందని.. జగన్ చెప్పిన తర్వాత.. వారంతా మానసికంగా సిద్ధమయ్యారు. కానీ.. ఇంతలోనే ఓ నలుగురిని సీఎం జగన్ మళ్లీ కొనసాగించనున్నట్టు భారీఎత్తున వైసీపీలోనే సమాచారం చర్చకు వస్తోంది. వివిధ సామాజిక, రాజకీయ సమీకరణల రీత్యా మంత్రులు ఆదిమూలపు సురేశ్, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాంలను కొనసాగిస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
తమను తప్పించడం కంటే, కొందరిని కొనసాగించాలనే సీఎం నిర్ణయం మంత్రులకు ఏ మాత్రం మింగు డు పడడం లేదు. ముఖ్యమంత్రి జగన్ మొదట చెప్పినట్టు అందరితో రాజీనామా చేయిస్తారని నమ్మామ ని సన్నిహితుల వద్ద మంత్రులు చెబుతున్నారు.
ఈ విషయంలో సీనియర్ మంత్రులు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ``మేం సీనియర్లుగా.. అన్ని సమస్యలను టాకిల్ చేశాం. ఇప్పుడు జూనియర్లకు.. పదవులు అలానే ఉంచి.. మమ్మల్ని బయటకు పంపేస్తారా? ఇదేం పద్దతి. ఏదైనా ఉంటే.. అందరినీ తీసేయాలి. అంతేకానీ.. ఇలా చేయడం ఏంటి?`` అని సీనియర్లు అంతర్మథనం చెందుతున్నారు.
సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, తదితరులు సన్నిహితుల వద్ద సీఎం వైఖరిపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నట్టు తెలిసింది. మరి ఈ పరిణామం.. సీఎం జగన్‌కు ఎఫెక్ట్‌గా మారుతుందని అంటున్నారు పరిశీలకులు. మరం ఏం చేస్తారో చూడాలి.