Begin typing your search above and press return to search.

హస్తం''సాయం కోరడానికి ఢిల్లీ వెళ్లిన సేన

By:  Tupaki Desk   |   11 Nov 2019 6:39 AM GMT
హస్తంసాయం కోరడానికి ఢిల్లీ వెళ్లిన సేన
X
మహా రాష్ట్రం లో రాజకీయం చాల వేగంగా మార్పులు చెందుతుంది. ఎన్నికల ఫలితాల త్వరిత అందరూ బీజేపీ -శివసేన మరోసారి అధికారం చేపట్టడం ఖాయం అని అనుకున్నారు. కానీ , ఎన్నికల పొత్తు లో భాగంగా శివసేన 50:50ఫార్ములా కు బీజేపీ ఒప్పుకోక పోడంతో శివసేన బీజేపీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించ లేదు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహా రాష్ట్ర లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 105మంది విజయం సాధించ గా, శివసేనకు 56మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 44మంది,ఎన్సీపీ 54మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే మహా రాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే 145మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ఈ నేపథ్యం లో ఇక బీజేపీ తో తెగ దెంపులు చేసుకొని ..శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వ్యూహాలు ప్రారంభించింది. ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయలేము అని ఇప్పటికే బీజేపీ చెప్పడం తో మహారాష్ట్ర లో రెండవ అతి పెద్ద పార్టీ గా ఉన్న శివసేన ను ప్రభుత్వ ఏర్పాటు కు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనితో ఈ రోజు 2గంటలకు శివసేన నాయకులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు .

అలాగే మరో వైపు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తో మాట్లాడటాని కి శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. అలాగే ఈ రోజు సోనియా మహా రాష్ట్ర రాజకీయాల పై ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతల తో సమావేశం కానుంది. అలాగే శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ని ఆయన నివాసానికి వెళ్లి కలవనున్నారు. ఇదిలా ఉంటే మహా రాష్ట్ర సీఎం గా ఉద్దవ్ ఠాక్రే, డిప్యూటీ సీఎం గా ఎన్సీపీ వ్యక్తి ఉంటారని మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో శివసేన బీజేపీ తో సంబంధం తెంచుకొని .. ఏన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సమయం లో శివ సేన పార్టీ నుండి కేంద్రమంత్రి గా ఉన్న అర్వింద్ సావంత్ సోమవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు.