Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : విదేశీయులకి గృహ నిర్బంధం విధించిన ఏపీ ప్రభుత్వం !

By:  Tupaki Desk   |   19 March 2020 11:50 AM GMT
కరోనా ఎఫెక్ట్ : విదేశీయులకి గృహ నిర్బంధం విధించిన ఏపీ ప్రభుత్వం !
X
కరోనా వైరస్ ..చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ ఇప్పుడు 161 దేశాలకి వ్యాప్తి చెందింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 2,18,631 దాటింది. మృతుల సంఖ్య 8,809 దాటింది. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ కరోనా పరిస్థితిపై వివరాలు వెల్లడించింది. కాగా , భారత్ లో కూడా కరోనా ప్రభావం రోజురోజుకి వేగంగా విస్తరిస్తుండటంతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి. తెలంగాణాలో ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏపీలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఏ విదంగా ఉంది అనేదానిపై ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో ఇప్పటివరకు కరోనా పరీక్షలు ఎంతమందికి చేసారు..ఎంతమంది క్వారంటైన్ లో ఉన్నారు. ఎంతమంది అనుమానితులు ఉన్నారు వంటి వివరాలని తెలిపారు. అలాగే మరో ముఖ్యమైన ప్రకటన కూడా చేసారు. విదేశాల నుండి ఏపీకి వచ్చిన ప్రతి ఒక్కరి స్వీయ గృహనిర్బంధన నోటిస్ జారీ చేయబడుతుంది అని ,ఆ నోటీసుని ఎవరైనా అతిక్రమిస్తే ..ఏపీ ఎపిడెమిక్ డిసీజ్ ..కోవిడ్ 19 , 2020 .. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చట్టరీత్య చర్యలు తీసుకోబడతాయి అని తెలిపారు. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ విదేశాల నుండి వచ్చే వారిలోనే ఎక్కువగా బయట పడుతుండటం తో ..ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అలాగే విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారి సమాచారాన్ని ముందే సేకరించి, ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు.ఇకపోతే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా భాదితులు పెరిగిపోతుండటంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ...కరోనా వైరస్ నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యల పై ఏపీ సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయం లో నిర్వహించిన ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య శాఖ అధికారులు హాజరయ్యారు.