Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరిదీ ఎంత జిగిరీ రిలేషన్ అంటే..

By:  Tupaki Desk   |   27 Dec 2016 5:49 AM GMT
ఆ ఇద్దరిదీ ఎంత జిగిరీ రిలేషన్ అంటే..
X
గుట్టుచప్పుడు కాకుండా అక్రమాస్తుల్ని కూడబెట్టిన ఇద్దరుప్రముఖులు వ్యవహారం ఒకరితర్వాత ఒకరన్నట్లుగా బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరి విషయంలో ఈ మాటలంటున్నారా? అక్కడికే వస్తున్నాం. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు.. కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి.. తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పెద్దనోట్ల రద్దు ఎపిసోడ్ లో బ్లాక్ మనీని మార్చే క్రమంలో అడ్డంగా బుక్ అయి దొరికిపోయిన శేఖర్ రెడ్డి లెక్కలు తేల్చే క్రమంలో వివేక్ ఎపిసోడ్ బయటకు వచ్చింది. ఆ క్రమంలో అతడూ బుక్ కావటం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ఎంత దోస్తానా ఎంత ఎక్కువన్న విషయాన్ని పరిశీలించిన అధికారులకు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. వీరిద్దరి లక్కీ నెంబర్లు.. కార్లనెంబర్లు ఒక్కటే కావటం విశేషం.

శేఖర్ రెడ్డికి రెండు బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లు ఉండగా.. ఈ రెండింటి చివరి నాలుగు నెంబర్లు ‘‘0005’’. అదే సమయంలో వివేక్ కారు నెంబరు కూడా ‘‘0005’’ కావటం గమనార్హం. ఉమ్మడిగా వ్యాపారాలు చేస్తూ.. కోట్లాది రూపాయిల నల్లధనాన్ని కూడబెట్టిన ఈ ఇద్దరి అదృష్టం ఒకేసమయంలో తారుమారుకావటం విశేషంగా చెప్పాలి. అదృష్ట సంఖ్య విషయంలోనే కాదు.. దురదృష్టంలోనూ ఇద్దరిపైనా ఒకేలా విరుచుకుపడటం ఈ ఎపిసోడ్ లో కీలకాంశంగా చెప్పాలేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/