Begin typing your search above and press return to search.

రాహుల్ నిర్ణ‌యం బాబుకు మేలుచేసేందుకేనా?

By:  Tupaki Desk   |   5 Jun 2018 12:31 PM GMT
రాహుల్ నిర్ణ‌యం బాబుకు మేలుచేసేందుకేనా?
X
ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఏపీలో ఉనికి కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మ‌రింత ఊపునిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణ‌యం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేందుకు తీసుకున్నారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే ఏపీ మ‌హిళా కాంగ్రెస్ ఇంచార్జీగా మాజీ ఎమ్మెల్యే సీత‌క్క నియామ‌కం అయ్యారు. తెలంగాణ‌కు చెందిన ఈ మాజీ ఎమ్మెల్యేకు ఏపీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం వెనుక‌ కొత్త లెక్కలున్నాయా? అనే ఆస‌క్తిక‌ర‌మైన వినిపిస్తోంది.

రాజ‌కీయ‌వ‌ర్గాల విశ్లేష‌ణ ప్ర‌కారం స్వ‌ల్ప‌కాలంలోనే విశేష గుర్తింపు ఇచ్చిన‌ప్ప‌టికీ...టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వదులుకొని మ‌రీ రేవంత్ కాంగ్రెస్‌ లో చేరారు. ఆయ‌న చేరిక స‌మ‌యంలో కాంగ్రెస్‌ లో కూడా టీడీపీలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ లభిస్తుందని - పార్టీ హామీ లభించిన తర్వాతే కాంగ్రెస్‌ లో చేరినట్లు ప్ర‌చారం జ‌రిగింది. రేవంత్‌ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు సీతక్క - వేం నరేందర్ రెడ్డి - బోడ జనార్ధన్ స‌హా పలువురు ముఖ్య నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఆ పార్టీలో వారికి ఎలాంటి గౌర‌వం ద‌క్క‌లేదు. రేవంత్ రెడ్డి త‌న‌తో పాటు తన వెంట వచ్చిన ముఖ్యులకు సముచిత స్థానం కల్పించాలన్న డిమాండ్ పార్టీ ముందు పెట్టిన‌ప్ప‌టికీ అది ఫ‌లితం ఇవ్వ‌లేదు. సంక్రాంతి తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గాన్ని ప్రక్షాళన చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేత‌ల్లో ఆశ‌లు చిగురించాయి. అయితే అదేమీ జ‌ర‌గ‌లేదు. అయితే ఇటీవ‌లి కాలంలో రేవంత్ వ‌ర్గానికి తీపిక‌బురు ద‌క్కింది. సీతక్కను కాంగ్రెస్‌ జాతీయ మహిళా విభాగం ప్రధానకార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లట్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామ‌కంతో త‌మ‌కు పెద్ద ఉప‌శ‌మ‌నం ద‌క్కిన‌ట్ల‌యింద‌ని రేవంత్ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

అయితే, రేవంత్ టీడీపీకి గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌ లో చేరిన స‌మ‌యంలో ఆయ‌న పార్టీ మార్పు వెన‌క చంద్ర‌బాబు ప్ర‌ణాళిక‌లు ఉన్నాయ‌నే చ‌ర్చ వినిపించింది. రేవంత్ టీంకు చెందిన నాయ‌కురాలికి ఇంచార్జీ బాధ్య‌త‌లు ఇవ్వ‌డం, అందులోనూ ఏపీ బాధ్య‌త‌లు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌లి కాలంలో కాంగ్రెస్‌ తో దోస్తీకి టీడీపీ చేరువ అవుతోంద‌నే చ‌ర్చ‌ల నేప‌థ్యంలో పార్టీలో కొన‌సాగిన స‌మ‌యంలో బాబును విశేషంగా గౌర‌వించిన సీత‌క్క‌ను ఏపీ ఇంచార్జీగా వేయ‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది.